సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్'కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.ప్రసాద్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పైడర్'. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్‌హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా వీక్షించారు.
'స్పైడర్' చిత్రం గురించి సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చేశారు. 'స్పైడర్'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com