క‌బాలి ప్ర‌మోష‌న్స్ కి ర‌జ‌నీ రాలేడా..

  • IndiaGlitz, [Tuesday,July 12 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం క‌బాలి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. అయితే...రజ‌నీకాంత్ గ‌త కొన్ని రోజులుగా యు.ఎస్ లో ఉంటూ కిడ్ని సంబంధిత వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నారు. దీంతో ర‌జ‌నీ ఆరోగ్యం గురించి రోజుకో వార్త వ‌స్తుండ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతుంటే...ర‌జ‌నీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆ వార్త‌ల‌పై స్పందించి అభిమానులు ఆందోళ‌న చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు క‌బాలి రిలీజ్ టైమ్ కి ర‌జ‌నీ చెన్నై చేరుకుంటార‌ని చెప్పారు.

క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా క‌బాలి సంద‌డి చేయ‌నుంది. కానీ...ర‌జ‌నీ మాత్రం యు.ఎస్ నుంచి చెన్నై వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ట‌. ఎందుకంటే...ప్ర‌స్తుతం ర‌జ‌నీ ఆరోగ్యం బాగానే ఉన్న‌ప్ప‌టికీ వైద్యులు మాత్రం యు.ఎస్ లోనే వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటూ విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌. వైద్యుల సూచ‌న మేర‌కు ర‌జ‌నీ యు.ఎస్ లోనే ఉంటార‌ట‌. సో...ర‌జ‌నీ క‌బాలి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనే అవ‌కాశం లేన‌ట్టే. కాక‌పోతే ర‌జ‌నీ ఆగ‌ష్టు మొద‌టివారంలో చెన్నై వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఒక‌వేళ ఆగ‌ష్టు మొద‌టివారంలో ర‌జ‌నీ వస్తే...అభిమానుల కోరిక మేర‌కు అప్పుడు మీడియా ముందుకు వ‌స్తారేమో చూడాలి.