close
Choose your channels

ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. అభిమానుల్లో టెన్షన్..!!

Friday, October 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. అభిమానుల్లో టెన్షన్..!!

సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరారు. ఆయన సన్నిహిత వర్గాల కథనం ప్రకారం... రజనీకాంత్ రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని సమాచారం. అయితే, ఆయన రాత్రి కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారా లేదా అన్నది తెలియరాలేదు. కావేరీ హాస్పిటల్ తరఫున ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రావాల్సి వుంది. భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న కొన్ని రోజుల్లోనే ఆయన ఆస్పత్రిలో చేరడంతో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. అభిమానుల్లో టెన్షన్..!!

కాగా.. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న రజనీకాంత్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి అభినందనలు తెలియజేశారు. గత సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నటుడు రజనీకాంత్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శాలువాతో సత్కరించి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందజేశారు.

ప్రస్తుతం రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘అన్నాత్తే’’ .. దీనిని తెలుగులో ‘‘పెద్దన్న’’గా విడుదల చేయనున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, డి సురేశ్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను దీపావళీ కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో సూపర్‌స్టార్ సరసన నయనతార ఆడిపాడనున్నారు. కిర్తీ సురేశ్.. రజనీకాంత్‌‌కు చెల్లెలిగా నటిస్తున్నారు. ఆయన మరదలిగా ఖుష్బు, కోడలిగా మీనా కనిపించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment