Namrata: బేబీ షవర్ పార్టీకి మహేశ్ దంపతులు.. నమ్రత ధరించిన కుర్తా ధర ఎంతో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ కపుల్ మహేశ్ - నమ్రతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె భార్యగా వచ్చాక మహేశ్ జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి. కథల ఎంపిక, మహేశ్ వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్మెంట్ , కుటుంబం వంటి వ్యవహారాలను నమ్రత చక్కబెడుతూ వుంటారు. అందుకే మహేశ్ కూల్‌గా తన సినిమాలు చూసుకుంటారు. సూపర్‌స్టార్ సైతం కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కుగా ప్రేమిస్తారు. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్తూ వుంటారు. ఇక కుటుంబంలో కానీ , బయట జరిగే ఫంక్షన్లకు కానీ నమ్రతతో పాటు ప్రత్యక్షమవుతారు మహేశ్. తాజాగా ఈ స్టార్ కపుల్ ఇటీవల ఓ బేబీ షవర్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
శ్రేయా భూపాల్ బేబీ షవర్ ఫంక్షన్ :
ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సహజంగా ఏ ఫంక్షన్‌లోనైనా మహేశ్ స్పెషల్ అట్రాక్షన్. వైట్ స్కిన్‌టోన్‌తో , ముట్టుకుంటే కందిపోయేలా వుండే అందమైన రూపం ఆయన సొంతం. అంతటి అందగాడు కావడం వల్లే పార్టీల్లో ఆయనను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడతారు. అయితే ఈ పార్టీలో మాత్రం నమ్రత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ఆమె డ్రెస్‌పైనే అందరి కన్నూ పడింది. దీనిపై ఫంక్షన్‌కు వచ్చిన వారు , నెటిజన్లు ఆరా తీశారు. దీని ధర ఎంత..? డిజైన్ ఎవరు చేశారు ఇలాంటి వివరాలపై నెట్టింట్లో సోదాలు చేశారు.
గ్రాఫిక్ ప్రింట్ కుర్తాలో నమ్రత :
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కథనాలను బట్టి.. నమ్రత ధరించిన కుర్తా ధర అక్షరాల రూ.4 లక్షలు. దీనిని జార్జియో అర్మానీ కుర్తా అంటారట.లాంగ్ స్లీవ్‌లు, మిడ్ లెంగ్త్‌తో వున్న ఈ సిల్క్ కుర్తాతో పాటు స్ట్రెయిట్ హెయిర్, మినిమల్ మేకప్, డైమండ్ చెవిపోగులతో నమ్రత దగదగ మెరిసిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారంలో నటిస్తున్నారు. దీని తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్శంలో ఓ భారీ యాక్షన్ మూవీలో సూపర్‌స్టార్ నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com