Guntur Kaaram: గ్లింప్స్‌తో మాస్ ట్రీట్ ఇచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ - త్రివిక్రమ్ 'గుంటూరు కారం'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీపై టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న వీరిద్దరూ దాదాపు పుష్కర కాలం తర్వాత ఒకే సినిమా కోసం పనిచేస్తున్నారు. #SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సూపర్‌స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్, గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మిర్చి యార్డులో బీడీ కాల్చుకుంటూ స్టైల్‌గా మహేశ్:
గ్లింప్స్ విషయానికి వస్తే.. గుంటూరు మిర్చి యార్డులో బీడీ కాల్చుకుంటూ మహేశ్ నడుచుకుంటూ వస్తాడు. విలన్ గ్యాంగ్‌ను కుమ్మేస్తూ వుంటాడు. ఈ సందర్భంగా ‘‘ ఏంటీ అట్టా చూస్తాండవు.. బీడీ ఏమైనా త్రీడీలో కనబడతందా’’ అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మహేశ్- త్రివిక్రమ్ మూవీకి తొలి నుంచి గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు అనే టైటిల్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి ‘గుంటూరు కారం’కు మేకర్స్ జై కొట్టారు.
సంక్రాంతి కానుకగా గుంటూరు కారం:
ఇకపోతే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గుంటూరు కారంని విడుదల చేస్తామని ఇప్పటికే మేక్రస్ ప్రకటించారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 5 నుంచి ప్రారంభంకానున్నట్లు ఫిలింనగర్ టాక్. దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com