Mahesh Babu : అనసూయ 'ప్రేమ విమానం' కు మహేశ్ సపోర్ట్.. టీజర్ అదిరిపోయిందిగా
Send us your feedback to audioarticles@vaarta.com
రావణాసుర, గూఢచారి వంటి భారీ బడ్జెట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ పిక్చర్స్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్స్‌ను కూడా నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే అభిషేక్ పిక్చర్స్ - ఓటీటీ సంస్థ జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘‘ప్రేమ విమానం’’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం సూపర్‌స్టార మహేశ్ బాబు రిలీజ్ చేసి.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ మూవీలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటించగా.. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించిన అనూప్ .. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్‌కు పనిచేస్తున్నారు. దీనిని సంతోష్ కటా తెరకెక్కించారు.
రైట్ బ్రదర్స్‌కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చి వుండవు :
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఓ గ్రామంలో ఇద్దరు పిల్లలు వారు నిత్యం దగ్గరలో వున్న కొండపైకి ఎక్కి అక్కడి నుంచి విమానాలను చూస్తుంటారు. ఆ ఇద్దరు పిల్లల్లో ఓ బాబు.. ఓరేయ్ మనం కూడా విమానంలో పోదాం రా అంటూ.. అయినా విమానం అంత ఎత్తులో ఎలా ఎగురుతుంది అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు.. విమానానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఆ చిన్నారులను వేధిస్తూ వుంటాయి. దీంతో తమ సందేహాలను గ్రామంలో వున్న ఒక వ్యక్తి వద్ద (వెన్నెల కిశోర్ ) వద్ద ప్రస్తావిస్తూ వుంటారు. దీనికి అతను విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్‌కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా తెలుసుకుని’’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ వుంటాడు.
పిల్లలు, ప్రేమ కథ చుట్టూ ప్రేమ విమానం:
మరోవైపు ఈ చిన్నారుల కథకు సమాంతరంగా మరో ప్రేమ కథను కూడా టీజర్‌లో చూపించారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలకు తోడు.. వారి ప్రేమను గ్రామం అంగీకరిస్తుందా .. లేదా అనే దాని చుట్టూ చూపిస్తారు. మరి ఆ పిల్లలకు, విమానానికి, వీరి ప్రేమ కథకు సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘‘ప్రేమ విమానం’’ చూడాల్సిందే. పిల్లల అమాయకత్వం వల్ల వచ్చే ఫన్, ఎంటర్‌టైనింగ్‌గా సాగే సన్నివేశాలు ఇవన్నీ ప్రేమ విమానంలో మిళితమై ఉన్నాయని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments