Super Star Krishna : సూపర్‌స్టార్ కృష్ణకు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు, హెల్త్ బులెటిన్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కృష్ణను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కృష్ణ కుటుంబంలో వరుస మరణాలు :
కాగా... ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే ఆయన సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. 1961లో ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల , ప్రియదర్శిని. కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ బాబు కొద్దికాలం పాటు హీరోగా పలు సినిమాలు చేసి తర్వాత నిర్మాతగా మారారు. రెండవ కుమారుడు మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరు. పెద్ద కుమార్తె పద్మావతి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి. మరో కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు సతీమణి.
శ్రీశ్రీ తర్వాత మరో చిత్రంలో నటించని కృష్ణ:
అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఐదేళ్ల క్రితం శ్రీశ్రీ చిత్రంలో నటించిన తర్వాత కృష్ణ సినిమాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments