ప్రజల హృదయాల్లో అమ్మకు సుస్ధిర స్ధానం - సూపర్ స్టార్ కృష్ణ
- IndiaGlitz, [Tuesday,December 06 2016]
గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె నటించారు. ఆ సినిమా కూడా హండ్రెడ్ డేస్ ఆడింది. అలాగే మేం సొంతంగా నిర్మించిన సినిమా దేవుడు చేసిన మనుషులు చిత్రంలో రామారావుగారి పక్కన ఆమె హీరోయిన్‌గా నటించింది. అది కూడా సూపర్ డూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి రాజ్యసభ సభ్యురాలయ్యారు.
ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తమిళనాడు ప్రజలు ఆమెను ఎంతో అభిమానంతో అమ్మా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేదలకు హెల్ప్ చేసే మంచి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో ఎప్పుడూ ఒక పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్‌ట్ ఎలక్షన్స్‌లో మరో పార్టీ అధికారంలోకి వచ్చేది. అలా కాకుండా లాస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై తర్వాతి ఎలక్షన్స్‌లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం తమిళనాడులో చాలా అరుదైన విషయం. ప్రజల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం తమిళనాడు ప్రజలకి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. - సూపర్‌స్టార్ కృష్ణ
జయలలితగారు చనిపోవడం అందర్నీ బాధించే విషయం. ఎందుకంటే ఒక మహిళగా ఎంత అపొజిషన్ వున్నప్పటికీ ఎంతో ధైర్యంగా నిలబడి తమిళనాడుని పరిపాలించారు. నిరుపేదలు కంటతడి పెట్టకూడదని వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఆమె చనిపోయిందన్న వార్త తెలిసిన తర్వాత అభిమానుల కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. వార్త విన్న వెంటనే నలుగురు హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. అంత మంచి అభిమానం సంపాదించుకున్నారు జయలలితగారు. రాజీవ్‌గాంధీగారి తర్వాత అంతటి అభిమానం సంపాదించుకున్న పొలిటీషియన్ జయలలితగారే అనుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను - శ్రీమతి విజయనిర్మల
జయలలితగారు చనిపోయారన్న వార్త తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబ సభ్యులు, తమిళనాడు ప్రజలు ఇంతటి విషాదాన్ని తట్టుకునే మాససిక స్థైర్యం కలిగి వుండాలని కోరుకుంటున్నాను - సూపర్‌స్టార్ మహేష్