బ్రహ్మోత్సవం చిత్రం చాలా చాలా బాగుంది - సూపర్ స్టార్ కృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్స్ గా పి.వి.పి సినిమా - ఎం.బి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన యూత్ ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం. ఈ చిత్రం ఈనెల 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ని సాధించి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ పెర్ ఫార్మెన్స్, కాజల్, సమంత గ్లామర్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, రత్నవేలు ఫోటోగ్రఫీ, తోట తరణి సెట్స్, మిక్కీ జె.మేయర్ సంగీతం,గోపీ సుందర్ రీ రికార్డింగ్ పివిపి ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా ప్రధానాంశాలుగా నిలిచాయి. కాగా ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మంచి రెస్పాన్స్ను రాబట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ - శ్రీమతి విజయనిర్మల, సీనియర్ నటుడు నరేష్ ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో వీక్షించారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...బ్రహ్మోత్సవం చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల చాలా అందంగా తీసాడు.ప్రతి సీన్ బ్రహ్మోత్సవం లాగానే ఉంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. అందరూ మంచి క్యారెక్టర్స్ చేసారు. పెద్ద స్టార్ కాస్ట్ తో సినిమాని అత్యద్భుతంగా రూపొందించారు. ప్రతి ఒక్కరూ ఎక్స్ ట్రార్డినరీగా నటించారు. ఇంత స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఈమధ్య కాలంలో రాలేదు. ఇంతకు ముందు సినిమాల్లో కంటే మహేష్ ఈ చిత్రంలో చాలా అందంగా కన్పించాడు. ప్రతి ఫ్రేమ్ ని కన్నులపండుగగా తీసాడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే రత్నవేలు ఫోటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. సినిమా చాలా బాగుంది. పి.వి.పి చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇంత మంచి సినిమా తీసినందుకు శ్రీకాంత్ అడ్డాలకి, పివిపికి థ్యాంక్స్ అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ...ఆడియో ఫంక్షన్ లోనే చెప్పాను. మహేష్ ఈ సినిమాలో చాలా స్టైలీష్ గా, అందంగా కన్పిస్తున్నాడు అని. నిర్మాత పివిపి కూడా అదే చెప్పారు నాకు. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ కన్పిస్తుంది. మహేష్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసాడు. ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. మహేష్ ని చూస్తుంటే... నాకే ఈర్ష్యగా ఉంది. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అందరికీ నా కంగ్రాట్స్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే సినిమా ఇది అన్నారు.
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ...నా చిన్నప్పుడు పండంటి కాపురం చిత్రంలో యాక్ట్ చేసాను. మళ్లీ అంతటి కుటుంబ కథా చిత్రం బ్రహ్మోత్సవం లో నటించాను. నలభై ఏళ్ల తర్వాత కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రంలో నటించినందుకు చాలా హ్యాఫీగా ఉంది. మార్నింగ్ షోస్ నుండే ఆల్ టైమ్ రికార్డ్ అని అందరూ అంటున్నారు. ఈ సినిమాతో మహేష్ తన సినిమాతో తానే రికార్డ్స్ తిరగరాసుకుంటాడు. ఒక మంచి మెసేజ్ తో మహేష్ చేసిన ఈ సినిమాకి డెఫినెట్ గా స్టేట్ అవార్డ్ వస్తుంది. అలాగే పెర్ ఫార్మెన్స్ పరంగా అత్యద్భుతంగా నటించాడు. తప్పకుండా నేషనల్ అవార్డ్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేనూ ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల మళ్లీ తన బ్రాండ్ నిలబెట్టుకున్నారు. పివిపి గొప్ప టేస్ట్ ఉన్న నిర్మాత. బ్రహ్మోత్సవం లాంటి ఒక మంచి చిత్రాన్నినిర్మించారు. పర్సనల్ గా ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ నన్ను బాగా కదిలించాయి. మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేమంతా సినిమాకి బాగా కనెక్టయిపోయాం. ఈ సినిమా జాయింట్ ఫ్యామిలీస్ అందరికీ బాగా నచ్చుతుంది. టీమ్ అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments