నా 75 సంవత్సరాల జన్మదిన సంచికను పుస్తకరూపంలో తేవడం ఆనందంగా వుంది - సూపర్స్టార్ కృష్ణ

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

తెరపై హీరోలను చూసి వారి సినిమాలను ఆదరించి వారిని అభిమానిస్తారు. కొంతమంది అయితే ఆ హీరోనే ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీగా వుంటారు. అంతలా అభిమానులు హీరోలను ఆరాదించి గుళ్లు కూడా కట్టేస్తుంటారు. రేపల్లెకు చెందిన గుమ్మడి ఝాన్సీలక్ష్మీ ఒక అభిమానిగా సూపర్‌స్టార్‌ కృష్ణ 75 సంవత్సరాల జన్మదిన సంచిక రూపంలో పుస్తకాన్ని వారి కుమారులు రవికృష్ణ, రామకృష్ణ రూపొందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జూలై 6న సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల స్వగృహంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, ప్రముఖ దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌లు బి.ఎ.రాజు, యు.వినాయకరావు, పద్మాలయా శాఖమూరి మల్లికార్జునరావు, ఘట్టమనేని నరసింహారావు, డాక్టర్‌ వాసిరెడ్డి శ్రీనాథ్‌, ఝాన్సీ లక్ష్మీ, రవికృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూపర్‌స్టార్‌ 75 జన్మదిన సంచికను ఎస్‌.వి. కృష్ణారెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని సూపర్‌స్టార్‌ కృష్ణకు అందించారు. మలి ప్రతిని కె.అచ్చిరెడ్డి రిలీజ్‌ చేసి శ్రీమతి విజయనిర్మలకు అందించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్ఞాపికలను సూపర్‌స్టార్‌ కృష్ణ అతిథులకు, అభిమానులందరికీ అందించారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''తేనె మనసులు'తో నా కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఆ తర్వాత కొన్ని ఎత్తుపల్లాలు వచ్చినప్పటికీ 'అగ్ని పరీక్ష' సినిమా సూపర్‌హిట్‌ అయి మళ్ళీ హీరోగా నాకు మంచి బూస్టప్‌ ఇచ్చింది. ఆ సమయంలో నా అభిమాని ఝాన్సీ లక్ష్మీ పెళ్లికి పిలిస్తే వెళ్లలేకపోయాను. అప్పట్నుంచీ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆమెను చూడటం ఇదే మొదటిసారి. నా 75 సంవత్సరాల జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం చాలా ఆనందంగా వుంది. ఇంతమంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన ఝాన్సీ లక్ష్మీని అభినందిస్తున్నాను. రైతు సమస్యల మీద 'పచ్చని సంసారం' సినిమా చేశాను. ఆ తర్వాత కృష్ణారెడ్డి ఇప్పటి ట్రెండ్‌ మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగ 'నెంబర్‌వన్‌' సినిమా చేస్తాను అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 'నెంబర్‌వన్‌' సినిమాని బ్రహ్మాండంగా తీసి సక్సెస్‌ చేశారు. ఆ చిత్రంలో చాలా గెటప్‌లతో నన్ను చూపించి అభిమానుల్ని అలరించారు. బెజవాడలో వినోద్‌ థియేటర్‌లో 'నెంబర్‌వన్‌' చిత్రం 175 రోజులు ఆడింది. నాకు అంత మంచి సినిమా ఇచ్చిన కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిగారికి నా థాంక్స్‌'' అన్నారు.

శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - ''ఇలాంటి పుస్తకాలు సంవత్సరానికి ఒకటి వస్తే ఆనందంగా వుంటుంది. అలాంటివి రావాలని కోరుకుంటున్నాను. వినాయకరావు 'దేవుడులాంటి మనిషి' పుస్తకాన్ని తీసుకొచ్చారు. కృష్ణగారి సినిమాలన్నింటి గురించి వివరంగా రాశారు. ఒక మహిళ అయి వుండి ఝాన్సీ లక్ష్మీ తన అభిమానాన్ని చాటుకుంటూ కృష్ణగారి గురించి గొప్ప పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఆయనలో చాలా మంచితనం వుంది. ఆ మంచితనమే ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకోవడానికి కారణం. సినిమా అన్నా.. నిర్మాతలన్నా.. ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. ఎప్పుడూ నిర్మాతలను సేఫ్‌జోన్‌లో వుండేలా ఆలోచిస్తారు. మిగతా అభిమానులతో పాటు నేను కూడా కృష్ణగారిని ఎక్కువ ప్రేమిస్తాను. దర్శకుడు బాబ్జీ కృష్ణగారి గురించి రాసిన పాట చాలా బాగుంది. ఝాన్సీ లక్ష్మీ వాళ్ల పిల్లలకి, మనవరాలికి కృష్ణగారి పేరు పెట్టుకొని తన అభిమానాన్ని చాటుకోవడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''సూపర్‌స్టార్‌ 75వ జన్మదిన సంచిక పుస్తకాన్ని నా చేతులమీదుగా కృష్ణగారికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా అభిమానించి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఝాన్సీ లక్ష్మీ ఈ పుస్తకరూపంలో తన అభిమానాన్ని చాటుకుంది. నేను కూడా కృష్ణగారితో 'నెంబర్‌వన్‌' సినిమా తీసి నా అభిమానాన్ని చాటుకున్నాను. అభిమానులకి వయసు పెరుగుతుందేమో కానీ, అభిమానానికి వయసు పెరగదు. ఇంకా రెట్టింపు అవుతుంది'' అన్నారు.

ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''75 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణగారి గురించి 75వ జన్మదిన సంచిక పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఆయన మీద వున్న అభిమానం వెలకట్టలేనిది. అమూల్యమైనది. ఆయన పై వున్న అభిమానానికి నిదర్శనంగా మేము 'నెంబర్‌వన్‌' సినిమా తీశాం. అది వంద రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమా పరిశ్రమ, కృష్ణ వేరు కాదు. కృష్ణ అంటే సినిమా పరిశ్రమ. 'సినిమా స్కోప్‌, 70 ఎంఎం, తొలి కౌబాయ్‌, ఈస్ట్‌మన్‌ కలర్‌' వంటి ఎంతో టెక్నాలజీని వెండితెరకు పరిచయం చేసి పరిశ్రమలో చరిత్రకారుడిగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు, సింహాసనం, మోసగాళ్లకు మోసగాడులాంటి సినిమాలను హాలీవుడ్‌ స్థాయిలో తీసిన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో కృష్ణగారు'' అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిగారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా వుంది. వినాయకరావు రాసిన 'దేవుడులాంటి మనిషి' పుస్తకం లాగే సూపర్‌స్టార్‌ 75 జన్మదిన సంచిక పుస్తకం కూడా చాలా బాగుంది. నేను కూడా త్వరలో కృష్ణగారి గురించి ఓ పుస్తకం తీసుకొస్తున్నాను'' అన్నారు.

ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ - ''కృష్ణగారికి నేను వీరాభిమానిని. ఆయన మీద వున్న అభిమానంతో నా ఇద్దరు పిల్లలకు రవికృష్ణ, రామకృష్ణ పేర్లు పెట్టాను. అలాగే నా మనవరాలికి కృష్ణప్రియ అని పేరు పెట్టాను. నా అభిమాన హీరో కృష్ణగారి 75 సంవత్సరాల జన్మదిన సంచిక పుస్తకాన్ని నా కుమారులు రూపొందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.

అనంతరం నల్గొండ జిల్లా సూపర్‌స్టార్‌ కృష్ణ-మహేష్‌ అభిమానులు నరసింహా, కిరణ్‌, శ్రీకాంత్‌లు సూపర్‌స్టార్‌ కృష్ణకి మెమొంటో అందజేశారు. నెల్లూరు అభిమాని రఫీ ఖాన్‌ తదితరులు గజమాలతో సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ-మహేష్‌ సేన అధ్యక్షులు దిడ్డి రాంబాబు, ఆలిండియా కృష్ణ - మహేష్‌ ప్రజాసేన అధ్యక్షులు ఖాదర్‌ ఘోరి, పల్లె జంగయ్యగౌడ్‌, కార్పొరేటర్‌ కాండూరి నరేంద్రాచార్యులు, విజయనగరం హుస్సేన్‌, తెనాలి సాహూల్‌, చిన్నా, రేపల్లె నందం సాంబశివరావు, కర్నూల్‌ అహ్మద్‌, నిర్మల్‌ మూటా గంగాధర్‌, ధనలక్ష్మీ, తాళ్లూరి పద్మ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

More News

'లై' చిత్రంలోని అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల

యూత్స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్మిటి).

ఆగస్టు 4న సుకుమార్ దర్శకుడు

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు.

ఈగ నుండి చేప...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నటుడే కాదు, నిర్మాత కూడా. డి ఫర్ దోపిడి సినిమాకు నాని నిర్మాతగా మారారు. ఆ సినిమా తర్వాత నాని మరే సినిమాను నిర్మించలేదు.

జూలై 28న విడుదలవుతున్న 'గౌతమ్ నంద'

మాస్ హీరో గోపీచంద్,హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న

క్రికెటర్ గా అందరిని ఆకట్టుకున్న శ్రీశాంత్ టీమ్-5 చిత్రం ద్వారా నటనలోనూ అందరిని ఆకట్టుకుంటాడు

భారత జాతీయ క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్,ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెర కు పరిచయం కానున్నాడు.