వాళ్లు సూపర్ స్టార్ ను కిడ్నాప్ చేస్తారట...
Send us your feedback to audioarticles@vaarta.com
నందు, భూపాల్, ఆదర్శ్, శ్రద్ధాదాస్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం సూపర్‌స్టార్ కిడ్నాప్`. లక్కీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుశాంత్‌రెడ్డి దర్శకత్వంలో చందు పెన్మత్స ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా..
దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ అవుటండ్ అవుట్ కామెడితో రూపొందిన సినిమా. సినిమా బాగా వచ్చింది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది`` అన్నారు.
నిర్మాత చందు పెన్మత్స మాట్లాడుతూ మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రం. సినిమాని అందరూ చూశాం. అవుట్‌పుట్ చాలా హ్యాపీగా అనిపించింది. మహేష్ ఫ్యాన్సే కాకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. కామెడి ఎంటర్ టైనర్`` అన్నారు.
భూపాల్ మాట్లాడుతూ సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మా చిత్రం సూపర్‌స్టార్ కిడ్నాప్ ఈ జూలై 3న మీ ముందదుకు రానుంది. ఈ సినిమా సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకుంటుంది. అవుటండ్ అవుట్ కామెడి ఎంటటర్టైనర్గా రూపొందింది. సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఆదర్శ్ మాట్లాడుతూ మా సినిమా 3న మీ ముందుకు వస్తుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా సినిమా ఉంటుంది. ఆదరిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
శ్రద్ధాదాస్ మాట్లాడుతూ ఇది డిఫరెంట్ కామెడి జోనర్ మూవీ. స్వామిరారా, దొంగాట తరహాలో ఉంటూనే కామెడి పార్ట్ ఎక్కువగా మిక్సింగ్‌గా ఉంటుంది`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ `సినిమా విజువల్ గా, కాన్సెప్ట్ పరంగా చాలా బావుంది. జూలై 3న వస్తున్న ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com