‘అణ్ణాతే’ షూటింగ్‌కి సూప‌ర్‌స్టార్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ‘అణ్ణాతే’ షూటింగ్‌ను పూర్తి చేసి త‌దుప‌రి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయాల‌ని అనుకున్నాడు. అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగి ఉండుంటే ఈరోజు ర‌జ‌నీకాంత్ త‌న పొలిటిక‌ల్ పార్టీ అనౌన్స్ చేసి ఉండేవాడు. కానీ ఆయ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తాయి. డాక్ట‌ర్స్ మాన‌సిక ఆందోళ‌న‌లు పెట్టుకుంటే క‌ష్ట‌మ‌ని సూచించ‌డంతో ర‌జినీకాంత్ ఆలోచించి రాజకీయాల త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న ఇచ్చేశాడు. ఇక ఎలాగూ రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు కాబ‌ట్టి.. సినిమాల మీద‌నే త‌లైవా ఫోక‌స్ పెట్టాల‌నుకుంటున్నాడ‌ట‌. అయితే ఇప్ప‌టికే పెండింగ్‌లో ఉన్న త‌లైవాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసేయాల‌నే ర‌జినీకాంత్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది.

జ‌న‌వ‌రి నెల‌లో పండ‌గ‌లు, ప‌బ్బాలు గ‌డిచిపోయిన త‌ర్వాత పూర్తి రెస్ట్ తీసుకుని ఫిబ్ర‌వ‌రి నుంచి ‘అణ్ణాత్తే’ షూటింగ్‌ను స్టార్ట్ చేద్దామ‌ని నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుడికి చెప్పేశాడ‌ట‌. అయితే షెడ్యూల్‌ను చెన్నైలోనే ప్లాన్ చేయ‌మ‌ని సూచించాడ‌ట‌. అందుకు నిర్మాత‌లు కూడా ఒప్పుకున్నాడ‌ట‌. డెబ్బై శాతం చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ ‘అణ్ణాతే’ సినిమాను నిర్మిస్తుంది.

More News

బ‌స్సు డ్రైవ్ చేసి అంద‌రికీ షాకిచ్చిన మిల్కీబ్యూటీ

మిల్కీబ్యూటీ తమన్నా రీసెంట్‌గా చేసిన ఓ ప‌ని అంద‌రినీ షాక్‌కు గురి చేస్తుంది.

న్యూఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్.. విమర్శలపాలవుతున్న ఆబ్కారీ శాఖ

ఓ వైపు కరోనా తుడిచిపెట్టుకు పోయింది లేదు.. పైగా కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తోంది.

అఖిల్ జోడీగా కొత్త హీరోయిన్‌... ఈసారైనా వ‌ర్క‌వుట్ అవుతుందా?

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడగింపు...

వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలుకు సంబంధించిన గడువును మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం: సోనూపై మెగాస్టార్ ప్రశంసలు

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బయటకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు.