సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు న్యూయర్ గిఫ్ట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కు కబాలి ప్రొడ్యూసర్ కలై ఫులి ఎస్ థాను న్యూయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇంతకీ కబాలి ప్రొడ్యూసర్ ఇచ్చే గిఫ్ట్ ఏమిటనుకుంటున్నారా...రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం కబాలి. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు కబాలి చిత్రంలోని తొలగించిన సన్నివేశాలను శనివారం యుట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని కబాలి ప్రొడ్యూసర్ కలై ఫులి ఎస్ థాను ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. దీనికి రజనీ ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. కబాలి డిలీటెడ్ సీన్స్ అని యాష్ ట్యాగ్ జోడించడంతో సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో ఇది ఇండియాలో టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. మరి...రేపు యుట్యూబ్ లో కబాలి డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సీన్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com