దిగ్గజ దర్శకుడి శంకర్‌కి షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ దర్శకుడు శంకర్‌కి కాలం కలిసొస్తున్నట్టుగా లేదు. ఒక సినిమా మధ్యలోనే ఆగిపోతే.. మరో సినిమా పట్టాలెక్కకుండానే అటకెక్కేలా ఉంది. ఏ ముహూర్తాన స్టార్ హీరో కమల్ హాసన్‌తో శంకర్ ‘ఇండియన్ 2’ మొదలు పెట్టారో కానీ.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే ప్రస్తుతం చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు కాబట్టి దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమాను పక్కనబెడితే తాజాగా హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ సినిమాను రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఆ దిశగా అడుగులు కూడా వేశారు.
ఈ సినిమా తెలుగులో కూడా ‘అపరిచితుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి సక్సెస్ సాధించాలని శంకర్ భావించారు. అయితే ఈ చిత్రానికి లీగల్ నోటీసులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ‘అన్నియన్’ చిత్ర నిర్మాత రవిచంద్రన్ ఈ రీమేక్ విషయంలో సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. తన అనుమతులు లేకుండా హిందీ రీమేక్ ఎలా చేస్తారంటూ రవిచంద్రన్ ఫైర్ అవుతున్నారు. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒరిజినల్ వెర్షన్ అన్నియన్ కథ తనకు సొంతమని రవిచంద్రన్ చెబుతున్నారు.
‘అన్నియన్’ కథ రాసిన రైటర్ సుజాత (దివంగత రంగరాజన్) తనకు పూర్తి హక్కులు ఇచ్చాడని.. దానికి సంబంధించి ఆయనకు డబ్బులు కూడా పే చేసానని రవిచంద్రన్ వెల్లడించారు. అలాంటి సమయంలో తనకు తెలియకుండా శంకర్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ముందుకు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా అన్నియన్ కథను రీమేక్ చేస్తానంటూ శంకర్ ముందుకు వెళితే మాత్రం న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments