Coolie:‘కూలీ’గా సూపర్‌స్టార్.. మాస్ అవతారంలో రజినీకాంత్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. గతేడాది 'జైలర్' మూవీతో వసూళ్ల సునామీ సృష్టించిన తలైవా మరో క్రేజీ మూవీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే రజినీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా టైటిల్ ప్రకటిస్తూ ప్రేక్షకుల మందుకు టీజర్ తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే పేరు ఖరారుచేశారు.
టీజర్ చూస్తుంటే ఈ మూవీ గోల్డ్ మాఫియా చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది. లోకేష్ తన సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఇప్పటిదాకా డ్రగ్స్ మాఫియా ఆధారంగా సినిమాలు తీశాడు. అయితే ఈ కథ మాత్రం గోల్డ్ మాఫియా చుట్టూ తీసినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఈ మూవీ LCUలో భాగం కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూపించనున్నాడు. ఈ విషయాన్ని లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపాడు. రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూడటం తనకు ఇష్టమని.. ఈ సినిమా అదే జోనర్‌లో ఉంటుందని పేర్కొన్నాడు.
ఇక భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నాగ్ ఈ సినిమాలో నటిస్తే 32 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కానుంది. 1991లో ‘శాంతి క్రాంతి’ అనే సినిమాలో చివరి సారిగా నాగ్, రజినీ కలిసి నటించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రస్తుతం 'వేట్టయాన్' అనే మూవీతో హీరోగా నటిస్తున్నాడు. టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య నటించిన 'జై భీమ్' సినిమాను అద్భుతం తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments