Coolie:‘కూలీ’గా సూపర్‌స్టార్.. మాస్ అవతారంలో రజినీకాంత్..

  • IndiaGlitz, [Monday,April 22 2024]

సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. గతేడాది 'జైలర్' మూవీతో వసూళ్ల సునామీ సృష్టించిన తలైవా మరో క్రేజీ మూవీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే రజినీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా టైటిల్ ప్రకటిస్తూ ప్రేక్షకుల మందుకు టీజర్ తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే పేరు ఖరారుచేశారు.

టీజర్ చూస్తుంటే ఈ మూవీ గోల్డ్ మాఫియా చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది. లోకేష్ తన సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఇప్పటిదాకా డ్రగ్స్ మాఫియా ఆధారంగా సినిమాలు తీశాడు. అయితే ఈ కథ మాత్రం గోల్డ్ మాఫియా చుట్టూ తీసినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఈ మూవీ LCUలో భాగం కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూపించనున్నాడు. ఈ విషయాన్ని లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపాడు. రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూడటం తనకు ఇష్టమని.. ఈ సినిమా అదే జోనర్‌లో ఉంటుందని పేర్కొన్నాడు.

ఇక భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నాగ్ ఈ సినిమాలో నటిస్తే 32 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కానుంది. 1991లో ‘శాంతి క్రాంతి’ అనే సినిమాలో చివరి సారిగా నాగ్, రజినీ కలిసి నటించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రస్తుతం 'వేట్టయాన్' అనే మూవీతో హీరోగా నటిస్తున్నాడు. టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య నటించిన 'జై భీమ్' సినిమాను అద్భుతం తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

More News

YCP leader:జగనన్న క్షమించు.. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాను: వైసీపీ నేత

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. పోలింగ్‌కు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో

Mukesh Dalal: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. సూరత్ ఎంపీ నియోజకవర్గం ఏకగ్రీవం..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఇప్పటికే తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. మరో 4 రోజుల్లో అంటే ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

CM Jagan:సీఎం జగన్ అధ్యక్షతన సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్ మీట్.. ఎప్పుడంటే..?

ప్రస్తుత డిజిటల్ కాలంలో సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ విషయాన్ని అయినా క్షణాల్లో వైరల్ చేసే సత్తా సోషల్ మీడియాకు ఉంది.

Chiranjeevi: తమ్ముడు కోసం రంగంలోకి అన్నయ్య.. తన మద్దతు ఎవరికో చెప్పేశారుగా..!

మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నుంచి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండనున్నారు.

AP Congress:ఏపీలో మరో 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన హైకమాండ్ తాజాగా మూడో జాబితా విడుదల చేసింది.