మళ్ళీ నితిన్ తోనే.. సూపర్ హిట్ కాంబో రిపీట్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సక్సెస్ అందుకున్నాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత నితిన్ తో వెంకీ తెరకెక్కించిన భీష్మ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యరికం నుంచి వచ్చిన వెంకీ కమర్షియల్ దర్శకుడిగా మంచి స్థాయికి చేరుతాడనే అంచనాలు మొదలయ్యాయి.
సింపుల్ కథకు ఫన్ జోడించి మ్యాజిక్ చేయడం వెంకీ కుడుముల స్టైల్. ఛలో, భీష్మ రెండు చిత్రాల్లో అదే రుజువైంది. భీష్మ తర్వాత వెంకీ కుడుములకు పలువురు స్టార్స్, యంగ్ హీరోల నుంచి పిలుపు వచ్చిందట. అందరితో ప్రాధమిక చర్చలు జరిగాయి.
ఇదీ చదవండి: కండోమ్ కథలో బోల్డ్ గా.. హింట్స్ ఇస్తున్న రకుల్
ఆ లిస్టులో మహేష్ బాబు, రాంచరణ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ప్రజెంట్ స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్స్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో వెంకీ మరోసారి నితిన్ నే అప్రోచ్ అయినట్లు టాక్.
వీరిద్దరి కాంబోలో రెండవ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితిన్ కూడా భీష్మ సక్సెస్ సందర్భంగా వెంకీతో మళ్ళీ పనిచేస్తానని హామీ ఇచ్చాడు. భీష్మ లాంటి హిట్ ఇచ్చినందుకు వెంకీకి నితిన్ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో చిత్రానికి త్వరలో ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com