దృష్టి థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

  • IndiaGlitz, [Friday,February 02 2018]

అందాల రాక్షసి, అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యానర్ పై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దృష్టి. రీసెంట్ గా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తుంది. 2.5 మిలియన్ డిజటల్ వ్యూస్ సాధించి చిన్న సినిమా గా మొదలై పెద్ద బజ్ ని క్రియేట్ చేసింది. అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబడుతున్నాయి. మారుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఇలాంటి సినిమా విజయాలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. దృష్టి అలాంటి సినిమా గా మిగులుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది యూనిట్.

ఈ సందర్భంగా, దర్శకనిర్మాతలు మాట్లాడుతూ: ట్రైలర్ కి వచ్చిన స్పందన చూసాక టీం చాలా వరకూ రిలీఫ్ అయ్యిందని అన్నారు. కొత్త కంటెంట్ ను ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారనడానికి దృష్టి పై పెరిగిన అంచనాలే నిరూపిస్తున్నాయి. ట్రైలర్ కి ఇలాంటి రెస్పాన్స్ ని ఊహించలేదు. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకున్న ఆడియన్స్ ని డిజ్జప్పాయింట్ చేయము. హీరో రాహుల్ తో పాటు వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారబోతుంది.'అన్నారు.

రాహుల్ రవీంద్రన్ హీరోగా, పవని గంగి రెడ్డి హీరోయిన్లుగా పనిచేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య ప్రకాష్, రవి వర్మ, ప్రమోదిని.. తదితరులు నటిస్తున్నారు.

More News

కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'గున్న' లోగో ఆవిష్కరణ

సాలగ్రామ్ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం'గున్న'.

కళాశాల నేపథ్యంలో చిరు అల్లుడి సినిమా

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే.

ఈ నెలలోనే రవితేజ, శ్రీను వైట్ల మూవీ

మాస్ మహారాజా రవితేజ,డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘టచ్ చేసి చూడు’.

చరణ్ , బోయపాటి.. ఓ ఐటమ్ సాంగ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!

ఓ నూతన దర్శకుడు,నూతన నిర్మాణ సంస్థలో రూపొందిన 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'