Harish Shankar: దుమ్మురేపుతోన్న 'ఈగల్' కలెక్షన్స్.. వారికి హరీశ్ శంకర్ కౌంటర్..

  • IndiaGlitz, [Monday,February 12 2024]

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుంది. యాక్షన్ సీన్స్‌లో రవితేజ అదరగొట్టేసాడని, కార్తీక్ డైరెక్షన్ సూపర్బ్‌గా ఉంది. దీంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మొదటి రోజే రూ.12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి సోలో హిట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఈగల్' మూవీకి నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాలో రూ. 17.00 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ.21.00 కోట్లు బిజినెస్ జరిగింది. ఇప్పుడు మూడు రోజుల్లో కలిపి రూ.30కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరో రెండు రోజుల్లో రూ.50కోట్లు రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా 'ఈగల్' టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ వెబ్‌సైట్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు.. రాత్రంతా తాగుతూ ఉన్నాడు.. గతంలో పవన్ కళ్యాణ్‌తో బ్లాక్ బస్టర్ తీశాడు అంటూ రాస్తారు. ఫోటో వేయరు.. ఏదో షాడో ఫోటో వేస్తారు.. అది ఇంకెవరు.. నేనే.. నా ఫోటో, పేరు రాసే ధైర్యం లేదు.. దైర్యం ఉంటే నా ఫోటో వేసి రాయండి.. నేను కౌంటరిస్తాను.. సినీ పరిశ్రమ అంటే కేవలం హీరో , దర్శక నిర్మాతలు మాత్రమే కాదు.. సినీ జర్నలిస్టులు కూడా పరిశ్రమలో ఒక భాగమే. మనం మనం కొట్టుకుని, తిట్టుకుని వేరేవాళ్ల ముందు తక్కువ అవ్వడం ఎందుకు. క్రిటిసైజ్‌కు.. ట్రోలింగ్ కు తేడా తెలియకుండా పోతుంది.

మనం ఒకే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద.. మేం ఈ గట్టు మీద లేపు.. అందరం కలిస్తేనే సినీ పరిశ్రమ కాదు.. కూడదు.. ఇలాగే నెగిటివ్ రివ్యూస్ రాస్తాం.. మీ సినిమాలు వస్తాయి కదా ? మీ సంగతి చూస్తాం.. అనుకుంటే మీ అభిమాన హీరో చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా అంటూ చెప్పకొచ్చారు. ప్రస్తుతం హరీశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ కల్యాణ్‌తో తీస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీని హరీశ్ తెరకెక్కిస్తున్నాడు.

More News

చంద్రబాబు కోసం రామోజీరావు తంటాలు.. ఎంతలా దిగజారారంటే..?

రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వానికే పట్టం కట్టేందుకు సిద్ధంగా

Tirupathi: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఈసీ వేటు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో దొంగ ఓట్ల వ్యవహారంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దీనిపై దృష్టి పెట్టి అధికారులపై వేటు వేస్తోంది.

వైయస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్‌లో ఎలా చేరారు..? రచ్చబండలో షర్మిలకు సూటి ప్రశ్న..

జిల్లాల పర్యటన చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గం ములగపుడి గ్రామంలో జరిగిన

Vyooham, Sapatham: 'వ్యూహం', 'శపథం' సినిమాలు విడుదల ఎప్పుడంటే..?

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం,

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వాటిపై విచారణ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.