Rajinikanth-Kapil Dev:దిగ్గజాలు కలిసిన వేళ : సింగిల్ ఫ్రేమ్‌లో కపిల్ దేవ్, రజనీకాంత్.. రెండు కళ్లు చాలడం లేదుగా

  • IndiaGlitz, [Friday,May 19 2023]

కపిల్ దేవ్, రజనీకాంత్.. వీరిద్దరి గురించి తెలియని భారతీయుడు వుండడు. భారతదేశానికి తొలి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించి దేశంలో క్రికెట్ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యారు కపిల్. ఇక రజనీ విషయానికి వస్తే.. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రజనీ. 70 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. వేర్వేరు రంగాలకు చెందిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అభిమానులకు పండగే కదా. వీరిద్దరూ కలిసి వున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాల్ సలాం సెట్స్‌లో కలుసుకున్న రజనీ, కపిల్ దేవ్:

అసలేం జరిగిందంటే .. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తోన్న చిత్రం ‘‘లాల్ సలామ్’’. ఇందులో తలైవా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్స్‌కు కపిల్ దేవ్, రజనీకాంత్ రావడంతో వీరిద్దరూ ఫోటో దిగారు. అనంతరం వారిద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేశారు. రజనీ లాంటి గొప్ప వ్యక్తిని కలవడం ఎంతో గౌరవమని కపిల్ దేవ్ పోస్ట్ చేయగా.. దేశానికి తొలి క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన పెట్టి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌ను కలవడం తనకు దక్కిన గౌరవమని రజనీ పోస్ట్ పెట్టారు.

గతంలో పలు సినిమాల్లో నటించిన కపిల్ దేవ్ :

అయితే లాల్ సలామ్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నారా అన్న విషయాన్ని మాత్రం ఇద్దరూ చెప్పలేదు. కపిల్ ఇప్పటికే ఇక్బాల్, 83, డబుల్ ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించారు. ఇక లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న లాల్ సలాంను సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

Sundeep Kishan:150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ వ్య‌వ‌స్థ సిరీస్‌ను  ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:  సందీప్ కిష‌న్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5.

LV Gangadhara Sastry:భగవద్గీతకే జీవితం అంకితం ..17 ఏళ్ల కృషికి గుర్తింపు : ఎల్‌వీ గంగాధర శాస్త్రికి గౌరవ డాక్టరేట్

ప్రసిద్ధ గాయకులు, గీతాగాన, ప్రవచన ప్రచారకర్త ఎల్‌వీ గంగాధర శాస్త్రికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వున్న "మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం"

Bro:పవన్ కళ్యాణ్ - సాయి తేజ్ సినిమా టైటిల్ ఇదే .. చివరికి అదే ఫిక్సయ్యారుగా, పవర్‌స్టార్ లుక్ మాత్రం కేక

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ తేజ్ కటిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Siddaramaiah:సస్పెన్స్‌కు చెక్ : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య... హైమాండ్ బుజ్జగింపులతో దిగొచ్చిన డీకే , డిప్యూటీ సీఎంగా ఓకే

గడిచిన వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటకలో అఖండ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌కు సీఎంను ఎంపిక చేయడం పెద్ద టాస్క్‌గా మారింది.

Kiren Rijiju;న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తప్పించిన మోడీ.. కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు

ఎన్నికల ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర న్యాయశాఖ బాధ్యతల నుంచి కిరణ్ రిజిజు నుంచి తప్పించారు.