ఆ యాడ్ కోసం మహేశ్ అంత తీసుకున్నాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు కాబోయే భర్త.. అచ్చం మహేశ్ లాగే వుండాలని కలలు కంటూ వుంటారు. వరుస బ్లాక్ బస్టర్లలతో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన మహేశ్.. సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలోనూ పాల్గొంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్‌తో పోటీపడే ఒకే ఒక్క దక్షిణాది నటుడు మహేశ్ మాత్రమే. ఇప్పటికే పలు బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తోన్న మహేశ్ బాబు.. ఇటీవల ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ 'మౌంటెన్ డ్యూ' డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీకో ఉత్పాదనల్లో మౌంటెన్ డ్యూ డ్రింక్ కూడా ఒకటి.
ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్ల ప్రమోషన్స్ చేపట్టిన సూపర్ స్టార్ ఈ యాడ్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారట. తాజాగా మౌంటెన్ డ్యూ యాడ్ కోసం మహేశ్ భారీ మొత్తంలో అందుకున్నట్లుగా సమాచారం. ఈ యాడ్ ప్రమోషన్ కోసం మహేష్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. గతేడాది కూడా ఈ బ్రాండ్ ప్రమోషన్ చేసిన సూపర్‌స్టార్.. అప్పుడు 7 కోట్లు తీసుకోగా, ఈ సారి దానికి 5 కోట్లు పెంచారట. మౌంటెన్ డ్యూ యాడ్ షూట్‌ని దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా వద్ద షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ హృతిక్ రోషన్ చేయగా.. తెలుగులో మహేష్‌కి దక్కింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. ఇటీవల ప్రిన్స్ మోకాలికి సర్జరీ చేయించుకోవడంతో షూటింగ్‌కు దూరంగా వున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో చిత్రీకరణ వేగంగా సాగుతోంది. సర్కారు వారి పాటలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాకు సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments