Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ లో ధరల వివరాలివే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు కాబోయే భర్త.. అచ్చం మహేశ్ లాగే వుండాలని కలలు కంటూ వుంటారు. వరుస బ్లాక్ బస్టర్లలతో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన మహేశ్.. సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలోనూ పాల్గొంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్‌తో పోటీపడే ఒకే ఒక్క దక్షిణాది నటుడు మహేశ్ మాత్రమే. ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్ల ప్రమోషన్స్ చేపట్టిన సూపర్ స్టార్ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
థియేటర్, వస్త్ర వ్యాపారంలో మహేశ్:
ప్రస్తుతం సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ రంగాల్లో రాణిస్తూనే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా చేరిపోయారు. వినూత్నంగా ఆలోచిస్తూ రియల్ లైఫ్‌లోనూ బిజినెస్‌మెన్‌గా రాణిస్తున్నారు సూపర్‌స్టార్. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ పేరుతో అతిపెద్ద మల్లిప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇది భాగ్యనగరానికే ఐకాన్‌గా మారింది. ఇక నిర్మాతగానూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ది హంబుల్ కో పేరుతో వస్త్ర వ్యాపారంలో కూడా అడుగుపెట్టారు.
ఏషియన్ భాగస్వామ్యంతో ఫుడ్ బిజినెస్:
తాజాగా మహేశ్ కన్ను మరో వ్యాపారంపై పడింది. రానున్న రోజుల్లో హాస్పిటాలిటీ, హోటల్ రంగానికి వున్న డిమాండ్ నేపథ్యంలో హోటల్స్ బిజినెస్‌లోకి దిగారు. తన భార్య నమ్రత పేరుతో ఏషియన్ గ్రూప్‌తో కలిసి విలాసవంతమైన రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారు సూపర్‌స్టార్. దీనికి ఏఎన్ అని నామకరణం కూడా చేశారు. ఇందులో ‘‘ఏ’’ అంటే ఏషియన్, ‘‘ఎన్’’ అంటే నమ్రత. ఈ కొత్త రెస్టారెంట్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో తెలంగాణ భవన్ పక్కనేవుంది. ఈరోజే రెస్టారెంట్ గ్రాండ్‌గా ఓపెన్ అయ్యింది. అయితే ఈ హోటల్‌లో ధరలు కాస్త ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. ప్లేట్ ఇడ్లీ రూ.90తో ప్రారంభం అవుతోంది. కానీ టేస్ట్ బాగుంటే ప్రజలు వాటిని పట్టించుకోరన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com