స్టార్ మా లో "సూపర్ సింగర్ జూనియర్"

  • IndiaGlitz, [Sunday,May 22 2022]

ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది స్టార్ మా. ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా.

స్టార్ మా స్టార్ సింగర్ వేదిక పైన పాడిన ఎందరో ఇప్పుడు మంచి సింగర్స్ గా తమ స్వరాలను వినిపిస్తున్నారు. ఈ పరంపరలో స్టార్ మా ఇప్పుడు కేవలం పిల్లల కోసం సూపర్ సింగర్ జూనియర్ పేరుతో ఓ కొత్త సిరిస్ ని రూపొందించింది. 6 నుంచి 15 సంవత్సరాల పిల్లలతో జరగనున్న ఈ సిరీస్ కోరుకున్నంత వెరైటీ గా, కావాల్సినంత ఫన్ పంచడానికి సిద్ధమవుతోంది.

ఈ సిరీస్ కోసం పిల్లల నుంచి ఎంట్రీలు పంపించమని స్టార్ మా లో ప్రోమో ప్రసారం చేసినపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 3 వేలకు పైగా ఎంట్రీ లు వచ్చాయి. వీళ్ళ నుంచి రకరకాల వడపోతలు జరిగాక 14 మంది టాప్ కంటెస్టెంట్స్ షో లో పాల్గొనే అర్హత సాధించారు. వీళ్ళతో సూపర్ సింగర్ జూనియర్ సిరీస్ ప్రారంభం అవుతుంది. టెలివిజన్ యువసంచలనాలు సుధీర్, అనసూయ ఈ షో ని ఎనెర్జిటిక్ గా నడిపించబోతున్నారు.

ఎన్నో భాషల్లో వేల పాటలు పాడి, ఎన్నో సినిమాలకు డబ్బింగు చెప్పిన మనో, నిత్య వసంత కోయిల చిత్ర, సెన్సషనల్ టాలెంట్స్ రెనినా రెడ్డి, హేమచంద్ర న్యాయ నిర్ణేతలు.

సూపర్ సింగర్ జూనియర్ - మే 22 న సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా లాంచ్ అవుతోంది. ఆ ఆ తరవాతి వారం నుంచి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.

సూపర్ సింగర్ జూనియర్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by: Indian Clicks, LLC

More News

శేఖర్ మూవీ నాది.. సినిమా జోలికొస్తే పరువు నష్టం దావా వేస్తా: నిర్మాత సుధాకర్ రెడ్డి వార్నింగ్

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవి... సోషల్ మీడియాలో లీకులు, గెలిస్తే చరిత్రే

బిగ్‌బాస్ .. బుల్లితెరపై దీనికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీలో అడుగుపెట్టిన ఈ షో.. క్రమంగా భారత్‌లోని ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది.

ఈసారి ఓట్లు చీలనివ్వను.. బీజేపీని ఒప్పిస్తా , చిన్న పదానికే భయమెందుకు : వైసీపీకి పవన్ చురకలు

వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరింత క్లారిటీ ఇచ్చారు.

అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ రచ్చ .. పోలీసుల లాఠీఛార్జ్, ఉద్రిక్తత

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమ అభిమాన నటుడి బర్త్ డే కావడంతో ఆయనకు విషెస్ తెలియజేయడానికి గురువారం

మిల్లర్ల చేతిలో పౌర సరఫరాల శాఖ కీలుబొమ్మ.. స్కామ్ వెనుక ‘పెద్దలు’ : వైసీపీ సర్కార్‌‌పై నాదెండ్ల ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల