సూపర్ హిట్ రీమేక్ ఆలోచనలో చైతు....

  • IndiaGlitz, [Monday,May 23 2016]

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఓ రీమేక్ లో నటించాలని అనుకుంటున్నాడని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. 1996 లో నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నేపెళ్లాడతా ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు చైతు ఈ చిత్ర రీమేక్ లో నటించాలనుకుంటున్నాడట., మరి చైతు ఆలోచనలు ఏ మేర పలిస్తాయో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే..