బిగ్‌బాస్ 5 తెలుగు: షన్నూ కొంపముంచిన ‘‘ 2 సెకన్లు ’’.. సన్నీదే పైచేయి, ఉత్కంఠగా ‘‘టికెట్ టూ ఫినాలే’’
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు ఫైనల్ బెర్త్‌ల కోసం జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ ఈ రోజు కూడా రసవత్తరంగా సాగింది. ముందరోజు ఎపిసోడ్లో తన తడఖా చూపించాడు సన్నీ. సిరి, శ్రీరామ్, పింకీలపై ఎటాకింగ్‌తో చెమటలు పట్టించాడు. ఐస్ బకెట్లో ఎక్కువ సేపు వుండటంతో వారి కాళ్లకు గాయమవ్వడం డాక్టర్లు రావడం చకచకా జరిగిపోయింది. నేటి ఎపిసోడ్ షణ్ముఖ్, కాజల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. టైమ్ టాస్క్‌లో మానస్‌పై ఆధారపడ్డ సన్నీ చివరి స్థానంలో నిలిచాడు. ఇక తల్లి వద్దంటున్నా సిరి మాత్రం షణ్ముఖ్‌కు హగ్గులు ఇస్తూనే వుంది. ఈ రోజు అది మళ్లీ రిపీట్ అయ్యింది. అలా ఎందుకు జరిగిందో..? ఈరోజు బిగ్‌బాస్ ఇంకా ఏం టాస్కులు ఆడించాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ ఫస్ట్ వచ్చాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో అతనిపై ఇంటి సభ్యులు సెటైర్లు వేశారు. ఇదే సమయంలో కాజల్- షణ్ముఖ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మనిద్దరిలో ఎవరు ముందు హౌస్ నుంచి వెళ్ళిపోతే వారిదే తప్పు ఉన్నట్లు అని షణ్ముఖ్ కామెంట్ చేశాడు. ఇక ఎప్పటిలాగే మానస్ ఎంత దూరం పెడుతున్నప్పటికీ అతడి వెంట పడే ప్రయత్నం చేసింది పింకీ.
అనంతరం బెడ్‌పై పడుకున్న సిరి పిలిచి మరీ షన్నును హగ్ చేసుకుంది. ఈ సందర్భంగా షన్ను కెమేరాల వైపు చూస్తూ.. ఇది కేవలం ఫ్రెండ్షిప్ హగ్ మాత్రమేనంటూ మళ్లీ తాను ఇరుక్కోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. సిరి కూడా షన్ను తనని బాగా చూసుకుంటున్నాడని, హగ్ ఇవ్వకపోతే బాగోదు కదా అని కామెంట్ చేసింది. అయితే సిరికి హగ్గిచ్చిన తర్వాత ప్రియాంక కూడా హగ్ కావాలని చెప్పగా.. షన్ను ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇక టికెట్ టు ఫినాలేలో పాల్గొనేందుకు అర్హత కోసం బిగ్ బాస్ మూడో టాస్క్ ఇచ్చారు. ఏటవాలుగా ఉన్న కాలువ లాంటి బల్లలపై పోటీలో పాల్గొనేవారు బకెట్స్ లో ఉన్న నీరు పోయాలి. ఆ బల్లల కింద కొన్ని జాడీలు అమర్చి ఉంటాయి. నీటితో ఆ జాడీలు నిండిన తర్వాత అందులో ఉన్న బాల్స్ పైకి వచ్చి కింద పడతాయి. అలా ముందుగా ఎవరైతే నీరు పోసి ఆ బాల్స్ ని కిందపడేలా చేస్తారో వారే విజేత. బాల్స్ అన్నీ కింద పడిన తర్వాత ఆ ఇంటి సభ్యుడు గంట కొట్టాలి. అప్పుడే వారి టాస్క్ పూర్తయినట్లు. ఈ టాస్క్‌లో గాయాల కారణంగా సిరి, శ్రీరామ్‌లకు ఆడే అవకాశం రాలేదు.
అయితే సిరి మాత్రం ఆడతానని ముందుకొచ్చింది. కానీ, బిగ్ బాస్ మాత్రం అంగీకరించలేదు. వారికి బదులుగా వేరే వాళ్లను ఆడేందుకు ఎంపిక చేసుకోవాలని సిరి, శ్రీరామ్‌లకు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో సిరి తన ఫ్రెండ్ షణ్ముఖ్‌ని... శ్రీరామ్.. సన్నీని ఆడాల్సిందిగా కోరారు. ముందుగా సన్నీ, షన్నూ.. తర్వాత కాజల్, ప్రియాంక పోటీ పడ్డారు. చివరిగా సిరి తరపున షన్ముఖ్.. శ్రీరామ్ తరపున సన్నీలు మానస్‌తో పోటీ పడ్డారు. ఇందులో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు.
అయితే ‘టికెట్ టు ఫినాలే’లోని మూడు టాస్కులకు సంబంధించి తక్కువ పాయింట్లు సాధించడంతో కాజల్, ప్రియాంక, షణ్ముఖ్‌లు పోటీ నుంచి తప్పుకుంటారు. అయితే, చివరి పాయింట్లలో షన్ను, సన్నీ చెరో 10 పాయింట్లతో సమానంగా ఉన్నారు. దీంతో బిగ్ బాస్ మరోసారి వారిద్దరికి ‘స్కిల్’ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో సన్నీ 20 సెకన్లలో పూర్తి చేసి బెల్ కొట్టగా.. షన్ను 22 సెకన్లలో పూర్తి చేశాడు. 2 సెకన్ల తేడాతో పాయింట్లను కోల్పోయి ఫినాలే ఫైనల్ రేసు నుంచి షన్నూ తప్పుకున్నాడు. అయితే, సిరికి మాత్రం ఈ టాస్కులో మంచి పాయింట్లే వచ్చాయి. రేపు మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు మళ్లీ పోటీ వుండేలా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com