అయోధ్యపై సుప్రీం తీర్పు: ఐదెకరాల స్థలం మాకు అక్కర్లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి శనివారంతో సుప్రీంకోర్టు ముగింపు పలికిన విషయం విదితమే. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కేవలం గంట వ్యవధిలోనే ఇన్నిరోజులుగా నెలకొన్న వివాదానికి సుప్రీం ఫుల్‌స్టాప్ పెట్టేయడం.. చారిత్రాత్మక తీర్పును వెలువరించడం విశేషమని చెప్పుకోవచ్చు. వివాదాస్పద భూమిని అయోధ్యకు ఇచ్చి.. ముస్లింల మందిరానికి ప్రత్యామ్నాయంగా మరో చోట 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సుప్రీం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును ముస్లిం సంఘాలు, సున్నీ వక్ఫ్‌బోర్డు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మాకు అక్కర్లేదు..!
ఈ తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు నిరాశపర్చిందని చెప్పుకొచ్చింది. మాకు ఐదెకరాల స్థలం అక్కర్లేదు కానీ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని సున్నీవక్ఫ్ బోర్డు పేర్కొంది.
ముస్లిం పర్సనల్ లా బోర్డు రియాక్షన్ ఇదీ..
‘సుప్రీంకోర్టు తీర్పుపై గౌరవం ఉంది. అయితే ఇందులో మాకు ఆమోదయోగ్యం కాని విషయాలు కూడా ఉన్నాయి. మరొక్కసారి దృష్టిసారించాల్సిందిగా సుప్రీంకు విన్నవిస్తాం. న్యాయపరంగా ఎలా అడుగువేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సుప్రీంకోర్టు తీర్పు మాకు సంతృప్తికరంగా లేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి. 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా?’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రశ్నించింది. అయితే ముస్లిం పర్సనల్ ఏం నిర్ణయం తీసుకోబోతోంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments