సన్నీ కండోమ్ గోల
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హాట్టీ సన్నిలియోన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఈ పోర్న్ స్టార్ ఏకంగా కండోమ్ కి సంబంధించిన గొడవలో ఇరుక్కుంది. ఇంతకీ విషయమేంటంటే సన్నిలియోన్ ఓ నిరోద్ కంపెనీ యాడ్లో ఇటీవల నటించింది. ఆ యాడ్ చూడ్డానికి చాలా అసభ్యకరంగా ఉందని, పురుషులను రెచ్చగొట్టేలా ఉందని రక్షా జ్యోతి ఫౌండేషన్ అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బీచ్ లో చిత్రీకరించిన ఆ యాడ్ కు సంబంధించి లూథియానా పోలీసులు సన్నిలియోన్ కు, సదరు యాడ్ కంపెనీకి సమన్లను జారీ చేశారు. వారం రోజుల్లో దీనిపై స్పందించాలనీ చెప్పారు. దీనిపై సన్నీ ఏమంటుందో చూడాలి. అన్నట్టు సన్నిలియోన్ ఇటీవల తెలుగులో కరెంటుతీగలో ఓ పాటలో నర్తించిన విషయం కూడా తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com