పాపను దత్తత తీసుకున్న సన్నిలియోన్

  • IndiaGlitz, [Friday,July 21 2017]

శృంగార తార స‌న్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. స్పెష‌ల్ సాంగ్స్ కూడా త‌న‌దైన శైళిలో న‌టిస్తుంది. సన్నిలియోన్ దంప‌తులు ఓ ఆడ‌పిల్ల‌ను ద‌త్త‌త తీసుకున్నార‌ని స‌న్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఈ పాప‌కి నిషా కౌర్ వెబ‌ర్ అనే పేరు పెట్టింది. త‌న అస‌లు పేరులోని కౌర్‌, త‌న భ‌ర్త పేరులోని వెబ‌ర్ ప‌దాల‌ను తీసుకుని త‌న పాప‌కు స‌న్ని పేరు పెట్టింది.
మ‌హారాష్ట్ర‌లోని లాతూర్ గ్రామానికి చెందిన ఓ అనాథ ఆశ్ర‌మం నుండి ఈ పాప‌ను స‌న్ని ద‌త్త‌త తీసుకుంది. చిన్నారి వ‌య‌సు 21 నెల‌లు. అనాథ ఆశ్ర‌మంలో కొంద‌రు చేస్తున్న సేవ చూసి బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని స‌న్ని నిర్ణ‌యించింద‌ట‌.