ఆరోజు ఎప్పటికీ రాదు - సన్నీ లియోన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్ ‘వీరమహాదేవి’ చిత్రంలో టైటిల్‌లో నటిస్తోంది. సన్నీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ‘కరణ్‌జీత్ కౌర్ - ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్‌జీత్ కౌర్. ఆమె పోర్న్‌స్టార్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితులు, ఆమె జీవితంలోని మలుపులను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు.
తాజాగా తన డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన సన్నీ భావోద్వేగానికి గురయ్యారు. షోను చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదని తెలిపారు. తన హృదయం వేలసార్లు బద్దలైందని ట్వీట్ చేశారు. నీలి చిత్రాల ప్రపంచంలోకి రాకముందు తాను ఎలా ఉండేదాన్నో.. అలా మళ్లీ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆరోజు ఎప్పటికీ రాదని, తన పాత వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుందని సన్నీ అన్నారు. తప్పు చేశానన్న భావన కలిగిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com