రివేంజ్ డ్రామాలో సన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
సన్నీలియోన్ ఉత్తరాది సినిమాలతో పాటు దక్షిణాది సినిమాలను కూడా అంగీకరిస్తుంది. ఇప్పటికే వడివుడయాన్ దర్శకత్వంలో ఓ మల్టీ లాంగ్వేజ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా పూర్తి కాక ముందే..మరో భాషా చిత్రంలో నటించడానికి సన్నీలియోన్ అంగీకరించింది.
వివరాల్లోకెళ్తే.. రఘురాజ్ అనే కన్నడ దర్శకుడు తెరకెక్కించబోయే ఓ రివేంజ్ డ్రామాలో నటించడానికి సన్నీలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు సినిమా హిందీలో కూడా తెరకెక్కనుంది. రీసెంట్గా దర్శకుడు రఘురాజ్ చెప్పిన కథ నచ్చడంతో సన్నీ ఓకే చెప్పేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాను తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com