సింగర్ సునీతను పెళ్లెప్పుడని అడిగితే..
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొద్ది రోజులుగా సింగర్ సునీత తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. ప్రస్తుతమైతే ఆమె పెళ్లి విషయమే హాట్ టాపిక్. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత.. చాలా గ్యాప్ తర్వాత రామ్ వీరపనేనితో పెళ్లికి సిద్ధమైంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఆమె పిల్లల సమక్షంలోనే జరిగింది. ఇక డిసెంబర్ 27న సునీత, రామ్‌ల వివాహం జరగనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే కారణమేంటో తెలియదు కానీ ఆమె వివాహం వాయిదా పడిందని.. వచ్చే ఏడాది వీరిద్దరి వివాహం జరగనుందంటూ ప్రచారం మొదలైంది.
కాగా.. సునీతకు చీరలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు సునీత చీర కడితే ఆ చీరకే అందం వస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆమె నేడు ఓ చీరల షోరూమ్‌లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఆమెను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తనకు చీరలంటే చాలా ఇష్టమని.. చీరలో హూందాతనం ఉంటుందని తెలిపారు. చీరలో మన పర్సనాలిటి రిఫ్లెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. తనకు తన పాటతో పాటు చీర కూడా ఒక ప్యాకేజ్‌లా అనిపిస్తాయని సునీత వెల్లడించారు.
చీరలో మన నడవడిక ఎలా ఉంటుందో.. దీంతో పాటే మనలో ఉన్న టాలెంట్ కూడా అవతలి వారికి అర్థమవుతుందని తాను భావిస్తానని సునీత తెలిపారు. అనంతరం పెళ్లి ఎక్కడ చేసుకుంటారు.. ఇక్కడ లేదంటే బయట ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. నవ్వుతూ కొట్టేస్తానని సమాధానమిచ్చారు. అయినా ఆమెను మీడియా వదలక.. అసలు మీ పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అని అడిగితే.. 'హుష్..' అంటూ వేలితో నోటిని కవర్ చేశారు. ఆమె రిప్లైని బట్టి చూస్తే ఇప్పుడప్పుడే సునీత పెళ్లి చేసుకోరని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments