సునీల్ - వీరు పోట్ల వీడు గోల్డ్ ఎహే టీజ‌ర్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,August 12 2016]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ - వీరు పోట్ల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం వీడు గోల్డ్ ఎహే. ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న సుష్మా రాజ్, రిచా ప‌న‌య్ న‌టిస్తున్నారు. ఈరోజు వీడు గోల్డ్ ఎహే టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. డిఫ‌రెంట్ గా ఉన్న ఈ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

వీరు పోట్ల మార్క్ లో ఉండే అవుట్ & అవుట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరు పోట్ల ఈ సంస్థ ద్వారానే బిందాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై స‌క్సెస్ సాధించారు. మ‌రి...ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన సంస్థ‌కి వీరు పోట్ల వీడు గోల్డ్ ఎహే చిత్రంతో కూడా స‌క్సెస్ అందిస్తాడేమో చూడాలి.