సునీల్ సంద‌డంతా అప్పుడే..

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

‘నువ్వేకావాలి’ సినిమాతో హాస్య‌న‌టుడిగా ప‌రిచ‌య‌మైన‌ సునీల్‌.. అన‌తి కాలంలోనే టాప్ క‌మెడీయ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు. అనంతరం హీరోగా మారిన ఈ కమెడీయన్ ఆరంభంలో కొన్ని విజయాలను సొంతం చేసుకున్నా.. తర్వాత వరుస ప‌రాజ‌యాల‌తో రేసులో వెనుక‌బ‌డ్డారు. కట్ చేస్తే.. మళ్ళీ పూర్తి స్థాయిలో హాస్య పాత్ర‌ల‌తో బిజీగా మారిపోయారు. ప్ర‌స్తుతం సునీల్‌.. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో పాటు.. ఎన్టీఆర్ హీరోగా తన స్నేహితుడు త్రివిక్ర‌మ్ రూపొందిస్తున్న‌ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోనూ పూర్తి స్థాయి హాస్య న‌టుడి పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

అలాగే ర‌వితేజ కొత్త చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లోనూ ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే విడుదల కానుండ‌డం విశేషం. మరోవైపు.. భీమనేని శ్రీనివాస‌రావు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సిల్లీ ఫెలోస్’ సినిమాలోనూ అల్లరి నరేష్‌తో కలిసి హీరోగా తెరను పంచుకుంటున్నారు సునీల్‌. ఈ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రిలీజ్ కానుంది. మొత్తానికి.. సునీల్ సంద‌డంతా ఈ ఏడాది సెకండ్ హాఫ్‌కే ప‌రిమితం కానుంద‌న్న‌మాట‌.

More News

ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారిగా..

2001లో విడుద‌లైన‌ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

అక్క‌డ హ‌వా కొన‌సాగిస్తున్న మిక్కీ

క్లాస్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

‘అర్జున్ రెడ్డి’ విజయం తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా మారిన నటుడు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.

జూన్‌ 1న విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'.

'ప్రేమకథా చిత్రమ్' మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

‘ఎస్‌.ఎం.ఎస్‌’ ( శివ మనసులో శృతి) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. ఆ త‌రువాత‌ 'ప్రేమకథా చిత్రమ్', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని', 'మోసగాళ్ళకు మోసగాడు'.