దసరా సందడంతా సునీల్ దేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
‘నువ్వేకావాలి’తో కమెడియన్‌గా పరిచయమై.. తక్కువ వ్యవధిలోనే తెలుగులో టాప్ కమెడియన్‌గా ఎదిగారు సునీల్. అనంతరం తెలుగులో చాలా మంది కమెడియన్స్ లాగే తాను కూడా హీరోగా మారారు. అంతేగాకుండా.. తెలుగులో ఏ కమెడియన్.. హీరోగా కొనసాగించని లాంగ్ ఇన్నింగ్స్ సునీల్ కొనసాగించారు. అయితే.. కెరీర్ ఆరంభంలో కొన్ని విజయాలను సొంతం చేసుకున్నా.. తర్వాత వరుస ఫ్లాపులు పలకరించాయి. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కమెడియన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సునీల్.
విశేషమేమిటంటే.. ఆ సినిమాలన్నీ కూడా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో సునీల్ కమెడియన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. సునీల్ కమెడియన్‌గా నటిస్తున్న మరో సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కూడా దసరాకే విడుదల కానుంది. అదే విధంగా.. సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ పోషించిన మరో చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ కూడా దసరాకే రిలీజ్ కానుంది. మొత్తానికి.. ఈ దసరాకి సందడంతా సునీల్దే అన్నమాట. ఈ సినిమాలతో కమెడియన్‌గా సునీల్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com