సునీల్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరికి కొన్ని విషయాలు భలేగా వర్కవుట్ అవుతాయి. దాంతో ఆ విషయాలు తెలియకుండానే సెంటిమెంట్‌గా మారుతాయి. కామెడీయన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ కి కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉందా? అవుననే అనిపిస్తోంది అతను ఎంచుకుంటున్న దర్శకులను గమనిస్తుంటే. 'మర్యాద రామన్న'వంటి ఘనవిజయం తరువాత కథానాయకుడు వేషాలను సీరియస్ గా తీసుకోవడం ఆరంభించిన సునీల్‌కి.. ఆ తరువాత వచ్చిన విజయాలు అంటే 'పూలరంగడు', 'తడాఖా' సినిమాలే. ఈ రెండు సినిమాలు కూడా ఆయా దర్శకులకు ద్వితీయ ప్రయత్నాలు. 'అహనా పెళ్లంట'తరువాత వీరభద్రమ్ చౌదరికి 'పూలరంగడు' రెండో సినిమా అయితే.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తరువాత దర్శకుడు డాలీకి 'తడాఖా' రెండో సినిమా. సెంటిమెంట్‌గా ఆ ఇద్దరు దర్శకుల రెండో సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి.
'తడాఖా' తరువాత సునీల్ చేసిన 'భీమవరం బుల్లోడు' ఆశించిన విజయం సాధించలేదు. దాంతో కొద్దిపాటి విరామం తీసుకున్న సునీల్.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా మారాడు. 'జోష్' ఫేం వాసు వర్మ దర్శకత్వంలో 'కృష్ణాష్ణమి'ని ఒక సినిమాగా చేస్తున్న సునీల్.. మరో సినిమాని 'రక్ష' ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్లతో చేస్తున్నాడు. ఈ రెండు కూడా ఆయా దర్శకులకు ద్వితీయ ప్రయత్నాలే. మరి సెంటిమెంట్ ప్రకారంగానే.. ఆ ఇద్దరు దర్శకులకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడో లేక యాదృచ్ఛికంగా జరిగిందో కానీ.. సునీల్ సినిమాలు తెలియకుండానే అతని హిట్ సెంటిమెంట్‌ని బలపరిచేలానే తెరకెక్కుతున్నాయి. మరి సునీల్ సెంటిమెంట్ ఎంతవరకు ఫలిస్తుందో.. కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com