రీమేక్‌లో సునీల్ చేయడం లేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో మంచి విజయాన్ని సాధించిన చతురంగ వేట్టై అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సునీల్ నటించడం లేదని వార్తలు వస్తున్నాయి. చతురంగ వేట్టై ఒక థ్రిల్లర్ మూవీ. సీరియస్ కోణంలో సాగుతుంది.
అయితే సునీల్ రీసెంట్ మూవీ ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్‌కు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ఇప్పుడు చతురంగ వేట్టై సినిమా చేయాలా? వద్దా? అని ఆలోచించి వద్దనే అనుకున్నాడట. ఇప్పుడు నిర్మాతలు మరో హీరోను వెతికే పనిలో బిజీగా ఉన్నారట. కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్ హీరోగా కెరీర్ ప్రారంభంలో అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న వంటి మంచి విజయాలనే సాధించాడు. ఈ మధ్య కాలంలో సునీల్‌కు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం కనపడటం లేదు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments