సునీల్ సినిమాకి టైటిల్ ఫిక్స్..

  • IndiaGlitz, [Sunday,December 27 2015]

సునీల్ న‌టించిన తాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కి మంచి స్పంద‌న వ‌స్తుంది. క్రిష్ణాష్ట‌మి సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...సునీల్...వంశీ క్రిష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న మ‌న్నారా చోప్రా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌క్క‌న్న అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి అనుచ‌రుడు అనే టైటిల్ ఫిక్స్ చేసార‌ట‌. క్రిష్ణాష్ట‌మి, అనుచ‌రుడు ఈ రెండు సినిమాల‌పై సునీల్ చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. మ‌రి..సునీల్ న‌మ్మ‌కం నిజం అవుతుందో లేదో చూడాలి.

More News

వర్మకు మరో ఇబ్బంది

సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్. ఈచిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నారు.

ముద్దులు వ‌ద్దంటున్న శౌర్య‌

నాగ‌శౌర్య చాలా సెంటిమెంట్‌గా ఫీల‌వుతున్నాడు. ప్ర‌తి చిన్న‌విష‌యాన్ని ఆయ‌న జాగ్రత్త‌గా ప‌రిశీలిస్తూ ముందుకుసాగుతున్నాడు.

సంక్రాంతి సందర్భంగా 'డిక్టేటర్' విడుదల - శ్రీవాస్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’.

'సర్దార్ గబ్బర్ సింగ్ ' రిలీజ్ డేట్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.

జనవరి 8న 'వీలైతే ప్రేమిద్దాం' విడుదల

వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’.