సునీల్ సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

పూలరంగడు', మర్యాద రామన్న', భీమవరం బుల్లోడు', మిస్టర్ పెళ్ళికొడుకు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం ఈడు గోల్డ్ ఎహే' జనవరి 5న ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది.

గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్' వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తుంది. సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 7 నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనున్న ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ లో గ్రాండ్ లెవల్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

జయసుధ, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, బాబ్ అంథోని, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్, షకలక శంకర్, నల్ల వేణు, సుదర్శన్, భద్రమ్, గిరి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: వివేక్ అన్నామలై, సినిమాటోగ్రఫీ: దేవరాజ్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వీరుపోట్ల.