నవంబర్ 7న సునీల్ , ఎన్.శంకర్ 'టు కంట్రీస్ ' రీమేక్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా `టు కంట్రీస్` చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం నవంబర్ 7 నుండి లాంచనంగా ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా...
దర్శక నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ - ``మలయాళంలో టు కంట్రీస్ సినిమా చూడగానే బాగా నచ్చింది. ఈ సినిమా బాగా సునీల్ యాప్ట్ అవుతుందనిపించి, మలయాళంలో 55 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం కామెడి ఎంటర్టైన్మెంట్, సినిమాలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాత్ర సునీల్‌గారు తప్ప ఎవరూ చేయలేరు. ఇది యూనివర్సల్ మూవీ. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మంచి స్క్రిప్ట్ కుదిరింది. శ్రీధర్ సీపాన మంచి సంభాషణలు కుదిర్చారు. మలయాళంలో `టు కంట్రీస్` చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులో సంగీతాన్ని అందిస్తున్నారు.చాలా గ్యాప్ తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నాకు, సునీల్‌కు మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా నవంబర్ 7న లాంచనంగా ప్రారంభమై అదే రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తాం. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్ ప్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్ మెంట్ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం`` అన్నారు.
సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com