సునీల్ కి ఇదో రికార్డు

  • IndiaGlitz, [Friday,March 25 2016]

క‌మెడీయ‌న్‌గా స్టార్ డ‌మ్‌ని చూసిన వైనం సునీల్‌ది. స్టార్ క‌మెడీయ‌న్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో.. ఒక్కో ఏడాదికి ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసిన సంద‌ర్భాలు త‌న‌కున్నాయి. అలాంటి సునీల్ హీరోయిజం చేయ‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నాక మాత్రం ఆ దూకుడు త‌గ్గింది. హీరోగా మారాక‌ ఏడాదికి ఒక‌టి.. లేదంటే రెండేళ్ల‌కి ఒక‌టి అన్న‌ట్లుగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సునీల్ ఈ ఏడాది మాత్రం త‌న కెరీర్‌లో స్పీడ్‌ని పెంచాడు. ఇప్ప‌టికే 'కృష్ణాష్ణ‌మి'తో ప‌ల‌కరించిన సునీల్‌.. మే లో 'జ‌క్క‌న్న' అనే మ‌రో చిత్రంతో సంద‌డి చేయ‌నున్నాడు.

అలాగే 'ఈడు గోల్డ్ ఏహే'తోనూ ఇదే ఏడాదిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. అంటే మొత్తంగా మూడు చిత్రాల‌తో సునీల్ వెండితెర‌పై వినోదాన్ని పంచేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌న్న‌మాట‌. ఒక విధంగా సునీల్‌కి ఇది రికార్డ్‌గానే చెప్పుకోవాలి. 2013లో మిస్ట‌ర్ పెళ్లికొడుకు, త‌డాఖా అనే రెండు చిత్రాల్లో న‌టించ‌డ‌మే హీరోగా సునీల్ పేరిట ఉన్న ఎక్కువ చిత్రాల రికార్డ్. అయితే.. మూడేళ్ల త‌రువాత మూడు చిత్రాల‌తో మ‌రో రికార్డ్‌ని క్రియేట్ చేస్తున్న సునీల్‌.. రానున్న సంవ‌త్స‌రాల‌లో ఆ సంఖ్య‌ని పెంచుతాడో లేదో చూడాలి.