సంక్రాంతి రేసులో సునీల్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి నిర్మించే డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న నాన్నకు ప్రేమతో...మూవీని సంక్రాంతికి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ కూడా సంక్రాంతి రేసులో ఉన్నానంటున్నాడు. సునీల్ నటిస్తున్న తాజా చిత్రం క్రిష్ణాష్టమి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. క్రిష్ణాష్టమి మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మరి..సక్సెస్ లో లేని సునీల్ కి సంక్రాంతి సక్సెస్ అందిస్తుందేమే చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com