అందుకే...బ్రూస్ లీ లాంటి సినిమాలు కాదు...జాకీచాన్ లాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. - సునీల్

  • IndiaGlitz, [Saturday,July 30 2016]

అందాల రాముడు, పూల రంగ‌డు, మర్యాద రామ‌న్న‌...త‌దిత‌ర చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ క‌థానాయ‌కుడు సునీల్. తాజాగా వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ న‌టించిన చిత్రం జ‌క్క‌న్న‌. వినోద‌మే ప్ర‌ధానంగా రూపొందిన‌ జ‌క్క‌న్న చిత్రం సునీల్ కెరీర్ లో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. టాక్ తో సంబంధం లేకుండా జ‌క్క‌న్న విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో సునీల్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం..

జ‌క్క‌న్న చిత్రానికి మీకు వ‌చ్చిన‌ ఫీడ్ బ్యాక్ ఏమిటి..?

ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలోని కామెడీని ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ‌స్ట్ టైమ్ నా కెరీర్ లో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ 3 కోట్ల 78 ల‌క్ష‌లు వ‌చ్చాయి. నేను ఇంత క‌లెక్ట్ చేస్తుంద‌ని అస‌లు ఊహించ‌లేదు. సినిమా పాస్ అవుతుంది అనుకున్నాను కానీ...ఈ రేంజ్ లో క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని అనుకోలేదు.

మీ కెరీర్ లో జ‌క్క‌న్న‌ ఫ‌స్ట్ డే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డానికి రీజ‌న్ ఏమిట‌నుకుంటున్నారు..?

అంతా ఆ దేవుడి ద‌య అనుకుంటున్నాను. అలాగే జ‌క్క‌న్న బ్యాక్ టు ఎంట‌ర్ టైన్ అనేది వ‌ర్క‌వుట్ అయ్యింది అనుకుంటున్నాను.

జ‌క్క‌న్న కు మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. రివ్యూస్ కొంత‌మంది నెగిటివ్ గా రాసారు క‌దా..వీటిపై మీ కామెంట్ ఏమిటి..?

ఒక‌టి, రెండు త‌ప్పితే...మిగిలిన వారంద‌రూ పాజిటివ్ గానే రాసారు. కొంత మంది నెగిటివ్ గా రాసారంటే అది వాళ్ల వ్య‌క్తిగ‌త అభిప్రాయం. అయినా జ‌నాలుకు న‌చ్చింది. కాబ‌ట్టే ఫ‌స్ట్ డే నా కెరీర్ లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ అందించారు.

ఈ చిత్రంలో ఫైట్స్ కూడా బాగా చేసిన‌ట్టున్నారు..?

అవునండి...ఫైట్స్ కూడా బాగా చేసాను అంటున్నారు. ఇంట‌ర్వెల్ & క్లైమాక్స్ ఫైట్స్ కు మంచి పేరు వ‌చ్చింది.

ఈ సినిమాలో మీ ఇన్ వాల్వెమెంట్ ఎంత వ‌ర‌కు ఉంది..?

కొన్ని కొన్నిసీన్స్ ను స్పాట్ లో డెవ‌ల‌ప్ చేస్తుంటాను. అది డైరెక్ట‌ర్ కూడా బాగుంది అంటేనే చేస్తాను. అలాగే నాకు తెలిసిన కొంత మంది రైట‌ర్స్ కి ఈ క‌థ చెప్పి వాళ్ల స‌ల‌హాలు తీసుకున్నాను. వాళ్లు ఏమీ ఆశించ‌కుండా వ‌ర్క్ చేసారు. ఈ సంద‌ర్భంగా వాళ్ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

పంచ్ డైలాగుల ట్రెండ్ ఎంత వ‌ర‌కు ఉంటుంది అనుకుంటున్నారు..? ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ ఎక్కువ అయ్యాయి అనిపించింది మీరేమంటారు..?

కామెడీ చేసే అవ‌కాశం లేక పంచ్ డైలాగులు పెట్టాం. అయితే...మాకు కూడా పంచ్ డైలాగ్స్ ఎక్కువ అవుతున్నాయి అనిపించింది. కానీ..బి, సి సెంట‌ర్స్ లో విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచ్ డైలాగుల ట్రెండ్ విష‌యానికి వ‌స్తే... హాలీవుడ్ సినిమాల గురించి రాసిన రివ్యూస్ గ‌తంలో చ‌దివాను. అందులో సింగిల్ లైన‌ర్స్ బాగా హెల్ప్ చేస్తాయి అని రాసారు. అందుచేత మిస్ యూజ్ చేయ‌కుండా సంద‌ర్భానుసారంగా ఉంటే పంచ్ డైలాగ్స్ కి క్రేజ్ ఎప్ప‌టికీ ఉంటుంది అని నా అభిప్రాయం.

చిరంజీవి 150వ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది కానీ...డేట్స్ కుద‌ర‌క మిస్ అయ్యార‌ని తెలిసింది నిజ‌మేనా..?

చిరంజీవి గారి 150వ సినిమాలో చేస్తాన‌ని నేనే అడిగాను. వాళ్ల అడిగిన టైమ్ లో నాకు కుద‌ర‌లేదు. కాక‌పోతే వాళ్ల అనుకున్న క్యారెక్ట‌ర్ కాకుండా మ‌రో క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఆగ‌ష్టు నెలాఖ‌రున నేను షూటింగ్ లో పాల్గొంటాను.

లేడీస్ టైల‌ర్, అహ‌నా పెళ్లంట‌..లాంటి సినిమాలు మీకు రావ‌డం లేదు అనిపించిందా..?

మీర‌న్న‌ట్టు ఇలాంటి సినిమానే క్రాంతి మాధ‌వ్ తో చేస్తున్నాను. ఇందులో ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

లేడీస్ టైల‌ర్, అహ‌నా పెళ్లంట త‌దిత‌ర చిత్రాల‌ను రీమేక్ చేయాల‌ని అనిపిస్తుంటుందా..?

నాకు రీమేక్ చేయ‌డం అంటే భ‌యం. ఎందుకంటే... క్లాసిక్స్ ను ట‌చ్ చేయ‌కూడ‌దు. ఒక‌వేళ ట‌చ్ చేసామంటే అందులో ఏదో కొత్త‌గా చూపించాలి. అందుచేత దాదాపు రీమేక్స్ కి దూరంగా ఉంటాను. ఒక‌వేళ మంచి స్ర్కిప్ట్ కుదిరితే ఆలోచిస్తాను.

వీడు గోల్డ్ ఎహే ప్రొగ్రెస్ ఏమిటి..?

సాంగ్స్ మిన‌హా టాకీ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే నాలుగు సాంగ్స్ ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.

ఫెయిల్యూర్స్ త‌ర్వాత క‌థ‌ల‌ ఎంపిక‌లో ఏమైనా మార్పు వ‌చ్చిందా..?

మార్పు వ‌చ్చిందండి...సీరియ‌స్ గా ఉండే సినిమాలు చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాను. న‌న్ను ఆడియోన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా కామెడీ క‌థ‌ల‌కే నా ప్రాధాన్య‌త. ఈ చిత్రంలో చూసిన‌ట్లైతే కేవలం రెండు చోట్ల మాత్ర‌మే సీరియ‌స్ గా ఉంటాను. ఇక నుంచి ఈ నిర్ణ‌యాన్ని ఖ‌చ్చితంగా ఫాలో అవుతాను. అందుక‌నే బిచ్చ‌గాడు సినిమా రీమేక్ కోసం న‌న్ను అడిగినా నేను చేయ‌లేదు. బ్రూస్ లీ లా యాక్ష‌న్ సినిమాలు చేయాల‌నుకోవ‌డం లేదు...జాకీచాన్ లా ఎంట‌ర్ టైన్మెంట్ విత్ యాక్ష‌న్ ఉండే సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.