సూపర్ హిట్ రీమేక్‌లో హీరోగా సునీల్...
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్యనటుడిగా కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ.. హీరోగా మారి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి.. అనంతరం ఆ పాత్ర.. ఈ పాత్ర అని కాకుండా నటనకు ప్రాధాన్యమున్న.. ప్రేక్షకుడికి నచ్చే పాత్రలతో దూసుకుపోతున్న నటుడు సునీల్. ప్రస్తుతం రీమేక్‌ల యుగం నడుస్తోంది. హీరోలంతా తమకు నచ్చిన.. సూపర్ హిట్ సినిమాల రీమేక్‌లతో అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా సునీల్ కూడా నడుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘బెల్‌బాటమ్’. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆహా’ద్వారా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి డిటెక్టివ్‌గా నటించారు. ఈ సినిమాను తెలుగులో సునీత్‌తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఈ సినిమా కథ సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోతుందని తెలుస్తోంది. అయితే సినిమాకు దర్శకుడు మాత్రం ఇంకా సెట్ అవనట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఆగితే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments