అతిథిగా సునీల్
Send us your feedback to audioarticles@vaarta.com
2000లో వచ్చిన నువ్వే కావాలి` సినిమాతో కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సునీల్. తర్వాత 2006లో వచ్చిన అందాల రాముడు`తో హీరోగా టర్న్ అయ్యారు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. మళ్ళీ కామెడీ క్యారెక్టర్ల వైపే మొగ్గు చూపారు. అయితే.. 2010లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న` సినిమా తరువాత హీరోగానే సెటిల్ అయిపోయారు సునీల్.
వరుసగా హీరో పాత్రలు చేస్తున్న సునీల్ కెరీర్లో.. 2013లో వచ్చిన తడాఖా` ఆఖరి హిట్. గత నాలుగు సంవత్సరాలుగా హిట్ కోసం పరితపిస్తున్నారీ ఒకప్పటి కమెడియన్. ఈ నెలలో విడుదల కాబోయే 2 కంట్రీస్` సినిమాపైనే సునీల్ ఆశలు పెట్టుకున్నారు.
పరిశ్రమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. హీరోగానే కాకుండా కమెడియన్, క్యారెక్టర్ రోల్స్.. ఇలా ఏవైనా చేయడానికి సునీల్ సిద్ధపడినట్లు సమాచారం. దీనికి తగినట్టుగానే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేస్తున్నారని వదంతులు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. కొత్త నటీ నటులతో వి.సముద్ర తెరకెక్కిస్తున్న సినిమాలో సునీల్ అతిధి పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఇదే సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com