క్రిస్మస్ బరిలోకి సునీల్....
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్డ్న్ హీరో సునీల్ మంచి సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. జయాపజయాలకు సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. వాసువర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి, వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో జక్కన్న, వీరుపోట్ల దర్శకత్వంలో ఈడు గోల్డ్ ఎహే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాయి. ఇప్పుడు సునీల్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ పినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సెన్సిబుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రాంతిమాధవ్, సునీల్‌ను కూడా సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఉంగరాల రాంబాబు చిత్రాన్ని ఈ క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుకున్నట్టు జరిగితే సినిమా క్రిస్మస్‌కు విడుదల కావడం ఖాయమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com