మరో రీమేక్‌లో సునీల్
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్యనటుడిగా మంచి ఊపు మీదున్న సమయంలో అందాల రాముడుతో హీరోగా మారాడు సునీల్. తమిళ చిత్రానికి రీమేక్ అయిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మర్యాద రామన్న, పూలరంగడు వంటి విజయాలను అందుకుని మంచి ఫామ్‌లోకి వచ్చాక.. హిందీలో హిట్ అయిన తను వెడ్స్ మనుని మిస్టర్ పెళ్లికొడుకుగా రీమేక్ చేశాడు సునీల్.
ఆ సినిమా విజయం సాధించలేదు. ఆ తరువాత వెంటనే తమిళంలో విజయం సాధించిన వేట్టైని తడాఖా రీమేక్ చేసి హిట్‌ని కొట్టాడు. ఇందులో నాగచైతన్యకి అన్నగా నటించాడు సునీల్.
ఆ తరువాత స్ట్రయిట్ సబ్జెక్ట్లపైనే ఫోకస్ పెట్టిన సునీల్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటైన ఉంగరాల రాంబాబు స్ట్రయిట్ ఫిల్మ్‌నే. ఇది ఈ నెల 15న విడుదల కానుంది. మరో సినిమా మాత్రం.. మలయాళంలో విజయం సాధించిన టూ కంట్రీస్‌కి రీమేక్. దీని తరువాత కూడా సునీల్ రీమేక్‌నే చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో విజయం సాధించిన సతురంగ వేట్టై (2014)ని రోమియో ఫేం గోపీ గణేష్ దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు సునీల్ సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు వరుస రీమేక్‌ల్లో నటిస్తున్న సునీల్‌కి ఆ చిత్రాలు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments