సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సునీల్?
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ప్రారంభంలో కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. 'అందాల రాముడు'తో కథానాయకుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కొన్ని కామెడీ పాత్రలు చేసిన సునీల్.. 'మర్యాద రామన్న' తరువాత పూర్తిస్థాయి హీరో పాత్రలకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఒకట్రెండు విజయాలు వరించినా.. ఇటీవల కాలంలో వరుస పరాజయాలు పలకరించడంతో తన మార్కెట్ బాగా పడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో.. తిరిగి హాస్య పాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు సునీల్.
అందులో భాగంగా.. తన స్నేహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమాలో పూర్తిస్థాయి హాస్యనటుడిగా సందడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సునీల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. కథకు కీలకమైన సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సునీల్ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఆసాంతం కనిపించే ఈ పాత్రతో.. సునీల్ గత వైభవం తెచ్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com