రీమేక్ లో సునీల్..?
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాముడు సినిమాతో కమెడియన్ సునీల్ హీరోగా మారాడు. అందాల రాముడు తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. తర్వాత సునీల్ కెరీర్‌లో హీరోగా చేసిన తఢాఖా కూడా రీమేక్ మూవీయే. ఇప్పుడు సునీల్ హీరోగా చేస్తున్న టు కంట్రీస్ సినిమా కూడా మలయాళ సినిమా టు కంట్రీస్‌కు రీమేక్‌గానే రూపొందుతోంది. టు కంట్రీస్ అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదలయ్యే అవశాలున్నాయి. ఈ సినిమా తర్వాత సునీల్ చేయబోయే సినిమా కూడా రీమేక్ సినిమానేనట.
తమిళంలో విజయవంతమైన చిత్రం చదురంగ వేట్టై సినిమాను తెలుగులో సునీల్ హీరోగా రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమాతో ఓ తమిళ ఫైనాన్సియర్ తెలుగులో నిర్మాతగా ఎంట్రీ కానున్నాడు. ఈయనతో పాటు శ్రీదేవి మూవీస్ బేనర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాను నిర్మిస్తాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముందు చదురంగ వేట్టై సినిమాను అడివి శేష్‌తో రీమేక్ చేయాలనుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com