రీమేక్ లో సునీల్..?

  • IndiaGlitz, [Wednesday,September 13 2017]

అందాల రాముడు సినిమాతో క‌మెడియ‌న్ సునీల్ హీరోగా మారాడు. అందాల రాముడు త‌మిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. త‌ర్వాత సునీల్ కెరీర్‌లో హీరోగా చేసిన త‌ఢాఖా కూడా రీమేక్ మూవీయే. ఇప్పుడు సునీల్ హీరోగా చేస్తున్న టు కంట్రీస్ సినిమా కూడా మ‌ల‌యాళ సినిమా టు కంట్రీస్‌కు రీమేక్‌గానే రూపొందుతోంది. టు కంట్రీస్ అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌శాలున్నాయి. ఈ సినిమా త‌ర్వాత సునీల్ చేయ‌బోయే సినిమా కూడా రీమేక్ సినిమానేన‌ట‌.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం చ‌దురంగ వేట్టై సినిమాను తెలుగులో సునీల్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాతో ఓ త‌మిళ ఫైనాన్సియ‌ర్ తెలుగులో నిర్మాత‌గా ఎంట్రీ కానున్నాడు. ఈయ‌న‌తో పాటు శ్రీదేవి మూవీస్ బేన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ సినిమాను నిర్మిస్తాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు క‌న‌పడుతున్నాయి. ముందు చ‌దురంగ వేట్టై సినిమాను అడివి శేష్‌తో రీమేక్ చేయాల‌నుకున్నారు.

More News

యాక్సిడెంట్ అనంతరం మళ్ళీ షూటింగ్ మొదలెట్టిన మంచు విష్ణు

'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్ లో భాగంగా తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తుండగా..

త‌మ‌న్నాని పొగిడిన కెమెరామేన్‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి 2 త‌రువాత మూడు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సందీప్ కిష‌న్‌తో ఓ సినిమా, క‌ళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా,క్వీన్ తెలుగు రీమేక్‌లో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోందిప్పుడు.

'స్పైడ‌ర్' డామినేట్ చేస్తోంది

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కింది మ‌హేష్ బాబు స్పైడ‌ర్‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ని చెన్నైలో నిర్వ‌హించి.. అక్క‌డ ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో మ‌హేష్  తమిళ తెర ఎంట్రీకి ఘ‌న స్వాగ‌తం చెప్పించిన సంగ‌తి తెలిసిందే.

రాశికి ఆ పాట నచ్చిందట

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది రాశీ ఖన్నా.

ఇంద్రసేన కి రెండు పాటలు బాకీ

బిచ్చగాడుతో తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న విజయ్ ఆంటోని..