నాకు ఇలాంటి అవకాసం మళ్లీ రాదేమో - హీరో సునీల్
- IndiaGlitz, [Monday,February 15 2016]
దిల్ రాజు నిర్మాతగా సునీల్, నిక్కీగల్రాని, డింపుల్ చోపడే నటీనటులుగా రూపొందిన చిత్రం 'కృష్ణాష్టమి'. వాసువర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆడియో సక్సెస్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్లాటినం డిస్క్ వేడుకని నిర్వహించారు. దిల్ రాజు చిత్ర యూనిట్‌కి ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందజేశారు.
''స్టార్ హీరో నటించే సత్తా ఉన్న కథ ఇది. సునీల్ సినిమాకు కావలసిన అంశాలను జోడించి తెరకెక్కించాం. దీని వెనుక వాసువర్మ కష్టం ఎంతో ఉంది. సునీల్ ఈ కథకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. ఫస్ట్ కాపీ చూశాక వాసువర్మ ఎలా ఉందని అడిగాడు. సింపుల్‌గా థమ్సప్ సింబల్ చూపించాను. ఈ సినిమా సక్సెస్ విషయంలో నా అంచనాల్ని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు'' అని దిల్ రాజు అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ''ఏడాదిన్నర క్రితం సునీల్‌కి లైన్ చెప్పాను. వెంటనే చేద్దాం అన్నాడు. తర్వాత వాసువర్మకి ఈ కథ చెప్తే కాదనలేక విన్నాడు. ఇందులో ఏదో మిస్ అయిందని ఆరు నెలలు స్క్రిప్ట్ వర్క్ చేసి పూర్తి కథను తయారు చేశాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే వాసు వర్మ కూడా ఓ కారణం. కెరీర్ ప్రారంభంలో నా సూపర్‌హిట్టైన 'దిల్', 'ఆర్య', 'బొమ్మరిల్లు' సినిమాలకు నా పక్కనే ఉన్నాడు. అతనిలో గొప్ప రచయిత ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుంటాడు. 2.50 నిమిషాల అవుట్‌పుట్‌ని 2.15 నిమిషాలకు కుదించాం. బెటర్ అవుట్‌పుట్ కోసం సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి సలహా తీసుకున్నాం. డబ్బింగ్ సమయంలో ప్రీ క్లైమాక్స్‌లో ఏదో వెలితిగా ఉందని డబ్బింగ్ ఇంజనీర్ పప్పు చెప్పిన సలహా కూడా పాటించాం. ఈ నెల 19న విడుదల కాబోతున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఆ సంస్థకు మంచి పేరు తీసుకొస్తుంది'' అని అన్నారు.
సునీల్ మాట్లాడుతూ ''నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో. ఇందులో చాలా అనందంగా కనిపిస్తాను. కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమిది. మనిషి పుట్టాడంటే ఇంటెలిజెంట్‌గా పుట్టాలి. లేదంటే వాసువర్మలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అయినా ఉండాలి. నా కెరీర్ మంచి సినిమా ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో..ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను'' అని అన్నారు.
వాసువర్మ మాట్లాడుతూ ''సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది దిల్ రాజుగారి ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పేయోచ్చు. 'జోష్' సినిమా చూశాక 'సార్ ఏంటి పరిస్థితి అని అడగగానే ఏవరేజ్ సినిమా' అని చెప్పారు. రిలీజ్ అయ్యాక అదే నిజమైంది. ఈ సినిమా చూసి ఆయనెంతో ఆనందంగా ఉన్నారు. ఎలా ఉందని అడిగితే నవ్వుతూ సక్సెస్ సింబల్ చూపించారు. మా అందరి నమ్మకం కూడా అదే. హిట్ సినిమాకు కావలసిన అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా ఇది. సునీల్ కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడి పనిచేశాడు. సినిమా బెటర్‌మెంట్ కోసం ఆర్టిస్ట్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ కొందరు నిర్మాతలు అందుకు సహకరించరు. దిల్‌రాజు ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం ఎంత ఖర్చైనా చేస్తారు'' అని అన్నారు. దిల్‌రాజుగారి అభిరుచికి తగ్గ పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు దినేష్ చెప్పారు.
సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఈ చిత్రం లో ఉన్నారు.
దర్శకత్వం - స్క్రీన్ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్